Spiritual | ఆధ్యాత్మికం

 Spiritual ( ఆధ్యాత్మికం )

ఆధ్యాత్మికం అనగానే అదేదో ముసలివాళ్ళు, సన్యాసులు, ఋషులు, యోగులు మొదలగు వాళ్ళు మాత్రమే అందులో ఉంటారు అని అనుకుంటారు. ఆధ్యాత్మికం అంటే దైవ చింతన మాత్రమే అని అనుకునేవారు కొందరు ఉంటారు. ఆధ్యాత్మికం అనేది మనసుకు సంబంధించినది. మనసు బాగుంటేనే కదా మన ఆలోచనలు బాగుండేది. మన ఆలోచనలు బాగుంటేనే కదా మన చేసే పని, దాని నుంచి వచ్చే ఫలితం బాగుండేది. అన్ని బాగుంటేనే కదా మనము బాగుండేది. మన మనసు ఆలోచనల సరళిని మార్చేదే ఆధ్యాత్మికం. ఆత్మ పరమాత్మగా మారటానికి కావలసిన మార్గమే ఆధ్యాత్మికం. దానికి దైవ చింతనతో పాటు, మనసు అంతర్లీనంగా శుద్ది అయ్యేది. అలా అయినప్పుడే, మనలో ఉన్న మాలిన్యం పోయి పవిత్రంగా మారుతుంది.

Image from MDIndia

కొందరు ఆధ్యాత్మికం అనగానే దేవాలయానికి వెళ్ళటం, పూజలు చెయ్యటం మాత్రమే అని భావిస్తూ ఉంటారు. అంటే చాలామంది గుడికి వెళ్తారు, పూజలు పునస్కారాలు చేస్తారు, గుడి నుండి బయటకు రాగానే బయట ఉన్న బిచ్చగాళ్లనో లేదా వేరే వాల్లనో తిట్టడం లేదా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. కనీసం ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియకపోతే, పూజలు పునస్కారాలు చేసి ఏమి లాభం. ఎదుటి వారికి సహాయం చేయలేని గుణం ఎందుకు. గుడి అనేది పవిత్రమైన ప్రదేశం, మన మనస్సును, ఆలోచనలను సక్రమమైన మార్గంలో పెట్టేదే ఈ ఆలయాలు. మంచి తనాన్ని నేర్పేవే ఈ ఆలయాలు. ఏదో మొక్కుబడిగా కోర్కెలు తీర్చే దేవుళ్లుగా మాత్రమే చూస్తే మన మనస్సు అనేది ఎప్పటికీ శుద్ది అవ్వదు. మనలోని అహాన్ని పోగొట్టినప్పుడే సార్థకత.

ఆధ్యాత్మికం అంటే దేవుడు, పూజలు కాదు. మన మనస్సు ప్రధానంగా చేసుకొని నిర్మలమైన మనస్సుతో మనం చేసే ప్రతీ పని అందరికీ ఉపయోగపడేలా, అందరినీ సమానంగా చూస్తూ, మన బాధ్యతలను గుర్తు చేస్తూ, చెడు కోర్కెలు లేకుండా, అసలు కోర్కెలే లేకుండా ఆ పరమాత్మతో లయం చేసేదే.

ఆధ్యాత్మికంలోకి వెళ్లాలంటే ఏ హిమాలయాలకో వెళ్లాల్సిన పని లేదు. నువ్ ఉన్నచోటే, నీ బాధ్యతలను నెరవేరుస్తూ కూడా పయనం చెయ్యొచ్చు. ఆధ్యాత్మికం వైపు పయనం చేయటానికి యోగ, ధ్యానం, వేదాలు, గ్రంధాలు, పుస్తకాలు, భక్తి మార్గం.. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. మార్గాలు ఎన్ని అయినా చేరే గమ్యం మాత్రం ఒక్కటే.

Spiritual Organizations:

    1. Bhavagni - Bhagavan Sri Veda Vyasa Sanathana Dharma Kshetram, Vykuntapuram, Guntur dist., Andhra Pradesh - 522020 Youtube: Bhavagni, facebook: Bhagavan Sri Veda vyasa Sanathana dharma kshetram
    2. Mount Shamballa, The Global Power Centre, Swagruha Paradise, Pigilpur Village, Deshmukhi Road, Batsingaram Post, Hayatnagar (M), Off NH -9, R.R. District, Mobile: 99490 88256, 98663 88745, 7989442024 YoutubeMount Shamballa
    3. Prasanna Trust - Swami Sukhabodhananda

Paripoornananda Swami:

  1. Shiva Sahasranama Stotram - Shiva Sahasranama Stotram Album - Shivaratri Special
  2. Sri Lalitha Sahasranama Stotram | Thousand Names of Goddess Lalita | MS Subbalaxmi Jr | BhakthiOne
  3. Sri Lalitha Sahasranamam Full With Lyrics - Lalita Devi Stotram - Rajalakshmee Sanjay - Devotional
  4. Vishnu Sahasranamam - M.S.Subbulakshmi
  5. Vishnu Sahasranamam Full Version Original
  6. Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS

Shivudu:

Lingastakam:

Narayana:

Youtube Channels:

Spiritual:

Bhakti:

    God, Temples:

Misc:

Post a Comment

0 Comments