Health Diet

 Diet (ఆహారం)

Definition of Diet:


(So many people think Diet means taking less food and take more times a day. but it is not correct.)
  • Diet means taking proper food on time with enough quantity.

Sprouts, Dry Fruits and Fruits


Daily Health Diet


Early Morning (With a brush or without) take 1 - 1.5 lts of water at a time

Break Fast: (Time: 8:00 to 9:30 AM)
  1. Lemon Juice with honey (1 or 2 glass(es)) (Or)
  2. Ragi Malt (Ambali / Ragi Java) (Or)
  3. Vegetable Juice with honey
Break: Half an hour
  1. Dry Fruits (Ground Nuts, Badam, Khaju, Pista, Walnuts, Anjeera, Cherry, Raisin (Kismis), etc.) (Take up to 20 or 25 each type)
  2. Sprouts (sufficient)
  3. Fruits (One or two fruits of any type, at least anyone fruit)
  4. Caret, Keera
         (Or)
  1. Pulka (Or)
  2. Wheat Ravva Upma (Or)
  3. Corn Flakes (Or) 
  4. Any other Flakes with Milk (Or) 
  5. Millet Items (Upma/Dosa/Pulav etc.)
Note: After Breakfast take only one sip of water.
Break: 2 hours
Take sufficient water


Lunch: (Time: 12:30 to 1:30 PM)
  1. Rice (Unpolished) with heavy curry (Without masala, Salt and Oil or use a little as much as) (Or)
  2. Ragi Sangatii (Or) 
  3. Brown rice (Or)
  4. Vegetable Rice (Or) 
  5. Coriander Rice without Masala
Note: After Lunch have only one sip of water.
Break: 2 hours
Take sufficient water


Evening snacks: (Time: 4:00 to 5:00 PM)

Snacks: Fruits (Sufficient) or any healthy snacks or any Fruit juice

Break: 1 hour
Take sufficient water (Until supper)



Supper: (Time: 6:00 to 8:00 PM)     
  1.      Pulka (2 to 3) with heavy curry (Or)
  2.      Roti (Jonna / Sajja / Ragi etc.) (Or)
  3.      Wheat ravva upma (Or)
  4.      Oats upma (Or)
  5.       Sago (Saggubiyyam) upma
Note: After Supper or Dinner take only one sip of water.


Note:                                                            
  • Do exercise or Yoga or Asanas or Running or Walking (at least 1 or half an hour)
  • Take proper food on time and enough rest (sleep).
  • Don't take water while eating and vice versa.
  • Adults should take 5 and a half ltr’s of water per day (at least 4 lts)
  • Avoid white goods (like Salt, Sugar, white rice (polished), Maida, etc.)
  • Instead of sugar take honey or Dates powder
  • Have at least one fruit (any seasonal) a day
  • Avoid Tea (Any Tea like Normal, Green, Black, Lemon etc.), Coffee, and Cool drinks – It will give instant energy to your brain, but it should not happen to the body. It will harm your body. It will cause Gastric problems.
  • Avoid cool/ice water
  • Avoid Oil foods (if you want to use as much as less)
  • Avoid Masala (Turmeric, Mustard Seeds, Pepper, Coriander, Cumin (Jeera), Ginger, Garlic, Asafoetida, Fenugreek Seeds) in curries in regular. Use whenever needed. The mentioned masala are not actually masala, those are Medicated content. If you take it regularly it will reduce the resistance power in your body.
  • Use Coconut powder, Curry Leaf powder, Gingely Seeds (Nuvvulu) powder, Groundnut (Peanut) powder in curries as regular.
  • Avoid Tamarind soup, use Tomato soup or Horse Gram (Vulavalu).
  • Take more water (Warm or normal) when you have Cold or Calf. Because water is having healing power.
  • Any problems in the body take liquids (juices) rather than having solid food.
  • If you want to eat fruits with any other item in Break Fast, Lunch, or Supper, take fruits first then take other items of food.
  • Avoid maximum outside food.
  • Do not walk or do exercise after eating. (Give at least 30 to 60 mins time after food)
  • Go motion at least two times a day (early morning and evening)


Myth(s):

  • If you eat Coconut will get Cough.
        Fact: If you eat Coconut with Sugar you will get Cough. The problem is with Sugar not with the Coconut.
  • If you eat Cucumber, Bottle gourd, Guava, you will get Cold.
        Fact: It is not correct.
  • Eating Papaya fruit, Honey, Wheat, Dates, etc., warm the body.
        Fact: It is not correct. If you take sufficient water, nothing will happen to the body. Water will take care of cooling the body.
  • Don’t eat fruits at night.
        Fact: It is not correct. You can take fruits at any time.
  • Can be eaten Papaya during pregnancy? / Can be eating papaya lose pregnancy?
       FactIt is not correct. You can take Papaya fruit without any doubt. It helps to cause normal delivery.


*****

నిర్వచనం:


చాలా మంది డైట్ పేరుతో తక్కువ ఆహారం తీసుకోవడం లేదా తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉంటారు. కానీ అది మంచి పద్దతి కాదు.

డైట్ (ఆహారం) అంటే మంచి ఆహారాన్ని సరైన సమయానికి సరిపోయినంత తీసుకోవటం. 

* శరీరానికి కావలసింది ఇవ్వాలే కానీ మనకు నచ్చినవి కావు.

రోజువారీ ఆరోగ్య ఆహారం ఎలా ఉండాలంటే...


ఉదయాన్నే నిద్ర లేవగానే (ముఖం కడుక్కున్న లేకున్నా) 1 లేదా 1.5 లీటర్ల నీటిని ఒకేసారి త్రాగాలి.

అల్పాహారం: (సమయం ఉదయం 8 గ. నుండి 9 గ.)
    ఉదయం 8 గంటలకు...
  • ఒకటి లేదా రెండు గ్లాసులు నిమ్మరసం తేనె తో కలిపి (లేదా)
  • అంబలి లేదా రాగి జావా
  • గోధుమ గడ్డి, తవుడు జ్యూస్
  • కూరగాయల రసం (క్యారెట్, బీట్రూట్, కీరా, టమోటా, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ, కాకరకాయ, పుదీనా కొత్తిమీర, పాలకూర కరివేపాకు మొదలగున్నవి)

    ఒక అర్ధగంట తర్వాత...

  1. డ్రై ఫ్రూట్స్ మరియు గింజలు (పల్లీలు, బాదం, జీడిపప్పు, పిస్తా, ఆక్రోట్, గుమ్మడి కాయ గింజలు, పొద్దు తిరుగుడు, పుచ్చకాయ గింజలు, కర్భుజ గింజలు, అంజీర, చెర్రీ, ద్రాక్ష మొదలగున్నవి - ప్రతీ ఒక్కటి 20 నుండి 25 వరకు తీసుకోవచ్చు, రాత్రి నానపెట్టి ప్రొద్దున లేదా ప్రొద్దున నానబెట్టి సాయంత్రం తీసుకోవటం).
  2. మొలకెత్తిన విత్తనాలు (పెసర్లు, శనగలు, అలసందలు మొదలగున్నవి)
  3. పండ్లు (ఏవైనా రెండు రకాలు, లేదా రోజుకు ఒక్కటైన)
  4. క్యారెట్, కీరా

        లేదా
  1. పుల్కా (లేదా)
  2. చిరుదాన్యాల ఉప్మా లేదా జావా (లేదా)
  3. అటుకులు

గమనిక: తిన్న వెంటనే ఒకే ఒక బుక్క నీరు త్రాగాలి. తర్వాత రెండు గంటల తర్వాత సరిపోయినంత నీళ్లు తీసుకోవాలి.

మధ్యాహ్న భోజనం: (సమయం 12.30 నుండి 1.30 వరకు)

  • ముడి బియ్యం, ఎక్కువ కూరతో (తక్కువ ఉప్పు, నూనెతో, మసాలాలు లేకుండా).
  • రాగి సంకటి.
  • బ్రౌన్ రైస్, రెడ్ రైస్...
  • వెజిటబుల్ లేదా కొత్తిమీర రైస్ మొదలగున్నవి

గమనిక: తిన్న వెంటనే ఒకే ఒక బుక్క నీరు త్రాగాలి. తర్వాత రెండు గంటల తర్వాత సరిపోయినంత నీళ్లు తీసుకోవాలి. గంట గంటకు సరిపోయినన్ని నీళ్లు తీసుకుంటూ ఉండాలి.

సాయంత్రం చిరుతిండి: (సమయం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు)

  1. ఏదైనా పండ్ల రసం, చెరకు రసం లేదా మజ్జిగ తేనె తో
  2. పండ్లు (ఒకటి లేదా రెండు)
  3. ఏదో ఒక లడ్డు లేదా పట్టీ (పల్లీ లడ్డు, నువ్వుల లడ్డు, కొబ్బరి లడ్డు, అవిశల లడ్డు, సున్నుండలు మొదలగున్నవి)

ఒక గంట విరామం తర్వాత తగినంత (2 నుండి 4 గ్లాసులు) తీసుకోవాలి.

రాత్రి భోజనం: (సమయం సాయంత్రం 6 నుండి 8 గంటలు)
  1. పుల్కా ఎక్కువ కూరతో
  2. రొట్టె (జొన్న, సజ్జ, రాగి మొదలగున్నవి)
  3. గోధుమ లేదా మిల్లెట్ రవ్వతో ఉప్మా
  4. ఓట్స్ లేదా సగ్గుబియ్యం ఉప్మా

గమనిక: తిన్న వెంటనే ఒకే ఒక బుక్క నీరు త్రాగాలి.

ముఖ్యమైన గమనికలు:
    1. ప్రతీ రోజు ఒక గంట వ్యాయామం చేయండి.
    2. సమయానికి పోషకాహారం మరియు సరైన నిద్ర.
    3. తినేటప్పుడు నీళ్లు త్రాగకూడదు, త్రాగేటప్పుడు తినకూడదు.
    4. రోజుకు 4 నుండి 5.5 లీటర్ల నీటిని త్రాగండి.
    5. ఉప్పు, చక్కర, పాలిష్ చేసిన బియ్యం, మైదా మొదలగున్నవి మానేయ్యటానికి ప్రయత్నించండి.
    6. చక్కరకు బదులు తేనె, బెల్లం, లేదా ఖర్జురం పొడి వాడండి.
    7. రోజు కనీసం ఏదో ఒక పండు తినండి.
    8. టీ, కాఫీ, మరియు కూల్ డ్రింక్స్, చల్లని నీళ్లు, పానీయాలు మానేయండి.
    9. ఆయిల్, జంక్ ఫుడ్ మానేయండి.
    10. మసాలా ఫుడ్ మానేయండి. కూరలల్లో పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, ఆవాలు మొదలగున్నవి రోజూ వెయ్యకండి, అవి మెడిసినల్ ఫుడ్, అవసరమైనప్పుడు వాడండి. ప్రతీ రోజు తీసుకుంటే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.
    11. కూరలల్లో రోజూ కొబ్బరి, నువ్వులు, పల్లీలు, కరివేపాకు పొడులను వాడుకోండి.
    12. చింతపండు రసం/చారు కు బదులు టమోటా, ఉలువ, చింతకాయ రసం చేసుకోండి.
    13. జలుబు, దగ్గు ఉన్నపుడు గోరు వెచ్చని నీరు త్రాగండి. నీళ్ల లొనే నిరోధక శక్తి ఉంటుంది.
    14. శరీరంలో ఏదైనా ఇబ్బంది ఉన్నపుడు ఘనపదార్థాలకు బదులు ద్రవాలు తీసుకోవాలి.
    15. వీలైనంత వరకు బయట ఆహారం మానేయండి.
    16. తిన్న వెంటనే వ్యాయామం చేయకండి.
    17. కనీసం రోజులో రెండు సార్లు అయినా విసర్జన చేయండి.

అపోహలు:

  1. కొబ్బరి తింటే దగ్గు లేస్తుంది అనేది అపోహ.
    • కొబ్బరితో పాటు చక్కర తింటే దగ్గులేస్తుంది. దగ్గుకు కారణం చక్కర.
  2. దోసకాయ, సొరకాయ, జామకాయ తినటం వల్ల జలుబు వస్తుంది అనేది అపోహ.
    • శరీరానికి మంచి అలవాటు లేకున్నా, వంట్లో కఫాలు ఉంటే బయటకు పంపుతాయి.
  3. తేనె, పొప్పడి పండు, గోధుమలు, ఖర్జురం తింటే వేడి చేస్తుంది అనేది అపోహ.
    • శరీరానికి సరిపడా నీరు తీసుకోకపోవడం కారణం.
  4. రాత్రిపూట పండ్లు తినటం మంచిది కాదు అనటం అపోహ.
    • పండ్లు ఎప్పుడైనా తినవచ్చు.
  5. పొప్పడి పండు తింటే ప్రేగ్నన్సీ పోతుంది అనటం అపోహ.
    • పొప్పడి పండు ఎప్పుడైనా తినవచ్చు. ఇంకా చెప్పాలంటే పొప్పడి పండు తినటం వలన పిల్లలు సహజంగా పుట్టడానికి అవకాశం ఉంది.

చక్కర వ్యాధి ఉన్నవాళ్ళు ఏవిదంగా ఆహరం తీసుకోవాలి (Diet for Sugar Patients)

మానెయ్యాల్సినవి:
    1. చక్కరను పూర్తిగా మానేయండి.
    2. పాలిష్ చేసిన బియ్యం, పాలిష్ చేసిన గోధుమలు (అంటే బయట కొంటున్న గోధుమ పిండి, కొంటే ఆర్గానిక్ స్టోర్ లో కొనండి), పాలు, మైదా పూర్తిగా మానేయండి.
    3. ఉప్పు పూర్తిగా మానేయండి. షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి చక్కర ఒక్కటే కాదు, ఉప్పు వల్ల కూడా చాలా నష్టం జరుగుతుంది.
    4. ఆయిల్ లేకుండా, లేదా తగ్గించి వంటలు చేసుకోండి.
    5. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ మానేయండి.
    6. షుగర్ వ్యాధి నియంత్రణ లో కొచ్చేవరకు మామిడి పండ్లు, సపోటా, సీతాఫలపండ్లు, అరటిపండ్లు, ఖర్జురపండ్ల ను మానేయండి.
    7. డాక్టర్ చెప్పాడుగా అని గంట గంటకు తినవద్దు. తిన్న మూడు సార్లు అయినా కార్బోహైడ్రేట్లు తక్కువ ఉన్న పదార్థాలు తినాలి.
    8. షుగర్ వ్యాధి నియంత్రణ లో కొచ్చేవరకు దుంప కూరగాయలు తక్కువ చేయండి, లేదా మానేయండి.
    9. నిలువ పచ్చళ్ళు మానేయండి.

తీసుకోవాల్సినవి:
    1. పీచు (ఫైబర్) ఎక్కువ ఉన్న పదార్థాలు తినాలి.
    2. ఆకు కూరలు ఎక్కువగా తినండి.
    3. మిల్లెట్స్ (కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామలు, ఊదలు), రాగులు, జొన్నలు, సజ్జలు తినాలి. రొట్టె రూపంలో కానీ, రవ్వతో జావ లేదా ఉప్మా రూపంలో తినవచ్చు.
    4. పొట్టు పప్పులు తినండి.
    5. కొన్ని కూరగాయలు పొట్టు తీయకుండానే వండండి. ఉదాహరణకు ఆలుగడ్డ, దోసకాయ మొదలగున్నవి.
    6. మిల్లెట్స్ కుదరకపోతే పుల్కా చేసుకొని ఎక్కువ కూరతో తినండి లేదా వెజిటబుల్ సలాడ్ చేసుకోండి.
    7. ఉదయం అల్పాహారంలో మొలకలు, కీరా, డ్రై నట్స్, పండ్లు తీసుకోవాలి.
    8. రాత్రి భోజనంలో ఏవైనా నాలుగు రకాల పండ్లు కడుపు నిండా తింటే మంచిది.
    9. రాత్రి భోజనం 7 గంటల లోపే పూర్తి చేయాలి.
    10. షుగర్ వ్యాధి నియంత్రణ లోకి రావటానికి కాకరకాయ బాగా పనిచేస్తుంది. వారంలో ఒకరోజు కాకరకాయ రసం త్రాగండి. ఒక స్పూన్ తేనె వేసుకోవచ్చు.
    11. అల్లనేరేడు పండ్లు తినండి. అల్లనేరేడు గింజలపొడి కూడా దొరుకుతుంది, ఆ పొడి నీళ్లలో వేసుకొని ఒక స్పూన్ తేనె కలుపుకొని త్రాగండి.
    12. మెంతి పొడి కూడా షుగర్ వ్యాధి నియంత్రణకు బాగా పనిచేస్తుంది. అన్నంలో ఒక స్పూన్ పొడితో ప్రతీ రోజు తినండి.
    13. రైస్ తినాలి అనుకునేవాళ్లు ముడిబియ్యం, పాలిష్ చెయ్యని ధాన్యాలు ఒక పూట మాత్రమే రైస్ తో ఎక్కువ కూర పెట్టుకొని తినండి.
    14. షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు కొబ్బరి బొండం బేసుగ్గా త్రాగవచ్చు. అపోహలు ఏమి పెట్టుకొనవసరం లేదు.
    15. తవుడు జ్యూస్ త్రాగండి.
    16. ప్రతీ రోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

Post a Comment

13 Comments

  1. Very Nice and useful information to practice good health.

    ReplyDelete
  2. good diet
    https://www.guruteachings1.com/

    ReplyDelete
  3. Nice useful information...naveen

    ReplyDelete
  4. Really good information. Simple to make children to understand what is diet.

    ReplyDelete
  5. Well said bro...keep posting good things like this.

    ReplyDelete
  6. Very nice and useful to all who wants health in normal process and continue regularly All the Best Naveengaru for doing society as it's necessary God Bless You and Your Family

    ReplyDelete
  7. Very useful information.. So many doubts clarified for me specially about water, When to take how to take.! Simple and effective. Thanks Mr.Naveen for such wonderful diet plan and happy to know about your awards and responsibility towards nature and society.👏👏 Keep posting..

    ReplyDelete
  8. Very good information sir this type of health tips are very useful in our daily life for health society.

    ReplyDelete