ఆరోగ్య చిట్కాలు | Health Tips in Telugu

ఆరోగ్య చిట్కాలు

Image from STE Primo



ఆరోగ్య చిట్కా #137

గుమ్మడికాయ ఉపయోగాలు, ఇది చాలా తక్కువ కేలరీస్ 10 GMs మరియు ఎక్కువ విటమిన్లు, మినరల్స్ కలిగిఉంటుంది. మీరు గుమ్మడికాయ కూర కూడా చేసుకోవచ్చు.

1. గుమ్మడికాయ జ్యూస్ బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది
2. చక్కర వ్యాధిని (బ్లడ్ షుగర్) బాగా నియంత్రిస్తుంది

ఆరోగ్య చిట్కా #138

ఊపిరితిత్తుల ఆరోగ్యం, శ్వాస సమస్యలను తగ్గించటానికి ఏం చేయాలి?

1. పొట్ట ఉన్నవాళ్లు తగ్గించాలి. పొట్ట పెరుగుతున్నా కొద్దీ మన ఊపిరితిత్తుల పైన ఒత్తిడి పడుతుంది.
2. సిగరెట్ అలవాటు ఉన్నవాళ్లు, వెంటనే మానుకోవాలి. సిగరెట్ లో ఉన్న కార్బన్ మొనక్సడ్, బెంజిన్, అమోనియా, క్యాడ్మియం, లెడ్, నికేల్ మొదలగున్నవి ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది.
3. చక్కర, చాక్లెట్ లు, ఐస్ క్రీంలు, స్వీట్స్, కూల్ డ్రింక్స్, బిస్కిట్స్ మానేయండి. వీటి వల్ల కఫం, శ్లేషం ఏర్పడుతాయి. ఈ కారణంగా ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది.
4. రోజూ ప్రాణాయమాలు చేయండి
5. రాత్రి భోజనం త్వరగా చేయండి, అంటే సాయంత్రం 5.30 pm నుండి 6.30 pm లోపలోనే చేయడానికి ప్రయత్నించండి.

ఆరోగ్య చిట్కా #139

ఈ రెండు ఆహారపదార్థాలు చేసే నష్టం తెలిస్తే మీరు అస్సలు తినరు. అవే ఉప్పు మరియు చక్కర. ప్రతి ఒక్కరు ఈ రెండింటిని ఎంతో కొంత ప్రతీ రోజూ తింటునే ఉంటారు. ఏంటి ఉప్పు అని అనుకుంటున్నారా, అవును నిజమే. ఉప్పు తినక పోతే ఏదో అయిపోతుంది అని అనుకుంటాము. కానీ మనం తినే వేరే ఆహారపదార్థాలు పండ్లు, కూరగాయలు, ధాన్యాలు మరియు మొదలగున్నవి అన్నింటిలో ఉప్పు ఉంటుంది. కాబట్టి మీరు ఉప్పు తినకపోయినా నష్టం జరగదు. రుచి కొరకు మాత్రమే మనం ఉప్పు తింటున్నాము. ఇక చక్కర విషయం మీకు తెలిసిందే ఎన్నో చెడు రసాయనాలతో కూడుకొని ఉన్నది.

1. ఉప్పు తినటం మానేయండి
2. చక్కర మానేయండి, దానికి బదులు తేనె, ఖర్జురం పొడిని వాడుకోండి.

ఆరోగ్య చిట్కా #140

రక్తం గడ్డకట్టకుండా ఉండాలంటే ఏమి చేయాలి? మన శరీరంలో రక్త ప్రసరణ మంచిగా జరగాలంటే రక్తం పలుచగా ఉండాలి. రక్తం గడ్డకడితే గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. రక్తం గడ్డకట్టడానికి ముఖ్య కారణం మనం తినే ఆహారమే, అందులో ఇంకా ముఖ్యంగా మనం తినే ఉప్పే కారణం అవుతుంది.

1. ఉప్పు తినటం మానేయండి
2. ఉప్పుకు బదులు కూరలల్లో నిమ్మకాయ రసం పిండుకోండి.

ఆరోగ్య చిట్కా #141

మనలో ఉండే చెడు క్రొవ్వును ఎలా తగ్గించుకోవాలి.

1. పాలిష్ చేసిన పదార్థాలను మానేయండి, ముఖ్యంగా ఉప్పు, చక్కర, మైదా, తెల్లటి బియ్యం, తెల్లటి రవ్వలు మొదలగున్నవి
2. అన్ని నాన్ వెజ్ పదార్థాలల్లో క్రొవ్వు బాగా ఉంటుంది, కాబట్టి అవి మానేస్తే మంచిది.
3. నూనె (ఆయిల్) వాడకం తగ్గించండి లేదా మానేయండి.
4. ఆకు కూరలు బాగా తినండి.
5. నీళ్లు బాగా త్రాగండి.

ఆరోగ్య చిట్కా #142

మంచి కాల్షియం ఉన్న ఆహారపదార్థాలు. కాల్షియం అనగానే అందరికి గుర్తు వచ్చేది పాలు.100 గ్రాముల చిక్కటి పాలల్లో ఉండేది 120 మిల్లిగ్రాములు, కానీ పాలకంటే ఎక్కువ కాల్షియం ఉన్న పదార్థాలు ఇప్పుడు చూద్దాం. 

క్రింద ఇచ్చిన లెక్క సుమారు 100 గ్రాముల పదార్థానికి, తోటకూరలో 397 మిల్లిగ్రాములు, మునగాకులో 440 మిల్లిగ్రాములు, మెంతికూర లో 397 మిల్లిగ్రాములు, పోనగంటి కూరలో 510 మిల్లిగ్రాములు, కరివేపాకు 830 మిల్లిగ్రాములు. నువ్వులు 1450 మిల్లిగ్రాములు.

ఇంకా ఆలోచించుకోండి, మనలో కాల్షియం లోపమున్నపుడు ఏమి తినాలో.

ఆరోగ్య చిట్కా #143

ఫోలిక్ ఆసిడ్ పుష్కలంగా ఉన్న పదార్థాలు. వైరస్ లతో పోరాడటానికి ఈ ఫోలిక్ ఆసిడ్ అత్యంత ముఖ్యమైన విటమిన్. ఇది మంచి రోగ నిరోధక శక్తికి మరియు క్రొత్త కణాల నిర్మాణానికి పనిచేస్తుంది. ప్రతీ రోజు మన బాడీకి 400 మైక్రో గ్రామ్స్ అవసరం ఉంటుంది.

1. ఇది ఎక్కువగా పెసర్లు, బెబ్బర్లు మరియు శనగలు లలో ఎక్కువగా ఉంటుంది. సుమారుగా వీటిలో 180 mg ఫోలిక్ ఆసిడ్ ఉంటుంది.
2. ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా ఆకు కూరలల్లో ఉంటుంది. ఎక్కువ ఫోలిక్ ఆసిడ్ ఉన్న ఆకుకూర పుదీనా.
3. పండ్లలో అవొకాడో పండులో లో ఫోలిక్ ఆసిడ్ ఎక్కువగా ఉంటుంది.

ఆరోగ్య చిట్కా #144

జీలకర్ర ఉపయోగాలు. దీనిలో ఉండే అపిజినిన్ మరియు లూటీయోలిన్ రసాయనాలు క్రొవ్వు కణాల లో ఉండే మంటను తగ్గిస్తుంది. బరువు తగ్గటానికి కూడా పనిచేస్తుంది.

1. జీరా మజ్జిగ తో తీసుకుంటే మంచిది. లూస్ మోషన్స్ ను నియంత్రిస్తుంది.
2. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి ఉపయోగపడుతుంది.

ఆరోగ్య చిట్కా #145

మంగుమచ్చలు తగ్గాలంటే ఏమి చేయాలి? ముఖ్యంగా మహిళలలో ఎక్కువగా కనపడుతుంది. మెలనోసైటీస్ ఎండ నుంచి రక్షణ కవచ్చంగా ఉపయోగపడతాయి. మెలనిన్ అనే రసాయనాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేయటం వల్ల ఈ మంగుమచ్చలు వస్తాయి. మహిళల్లో ఎక్కువ రావటానికి కారణం ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోయి ప్రోజెస్టరోన్ హార్మోన్ పెరగటం వల్ల వస్తుంది. మంగుమచ్చలు అంత త్వరగా తగ్గవు, ఒక్కొక్కసారి నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు.

1. ముఖానికి ఎండ తగలకుండా చూసుకోండి.
2. సోయా బీన్స్ రాత్రి నానబెట్టి, ప్రొద్దున వాటిని ఉడికించి కూరలల్లో వేసుకోండి. ఈస్ట్రోజెన్ హార్మోన్ పెరగటానికి సహాయపడుతుంది.
3. 60 నుంచి 70% సహజ సిద్ధమైన ఆహారాలు తీసుకోండి (పండ్లు, పండ్ల రసాలు, మొలకెత్తిన విత్తనాలు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, కూరగాయల రసాలు మొదలగున్నవి)
4. ప్రతి రోజు 4 నుండి 5.5 లీటర్ల నీళ్లు త్రాగండి
5. తేనెతో ముఖం మీద మర్దన చేసి కొద్దిసేపు (ఒక అరగంట) ఉంచి కడుక్కోండి. మచ్చలు తగ్గటానికి ఉపయోగపడుతుంది.

ఆరోగ్య చిట్కా #146

మంగుమచ్చలు తగ్గటానికి మరి కొన్ని చిట్కాలు. చింత గింజలను పేస్ట్ చేసి తేనె ను కలిపి ముఖం మీద మచ్చలు ఉన్నచోట పెట్టి ఓ అరగంట తర్వాత కడుక్కుంటే సరిపోతుంది. ఇలా చేయటం వలన నలుపు వర్ణానికి కారణమైన Tyrosinase ఎంజైమ్ ను తగ్గించి నలుపు వర్ణం ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇంకొరకంగా చింత గింజల పొడి చేసి దానిని తేనె తో కలిపి నాక వచ్చు, లేదా నీళ్లలో కలిపి త్రాగవచ్చు. ఇలా చేస్తుంటే కొన్ని నెలలకు మాములు చర్మం రావటానికి ఆస్కారం ఉంది.

ఆరోగ్య చిట్కా #147

మంగుమచ్చలు తగ్గటానికి మంచి జ్యూస్ బీట్రూట్. బీట్రూట్ లో ముఖ్యంగా 97.3 మైక్రోగ్రామ్స్ ఫోలిక్ ఆసిడ్ ఉంటుంది, ఈ బీట్రూట్ రసం లో ఉండే ఫోలిక్ ఆసిడ్ వల్ల క్రొత్త చర్మ కణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఎ ఉండటం వల్ల చర్మంలో పగుళ్లు రాకుండా రక్షిస్తుంది. బీట్రూట్ లో ఉండే సి విటమిన్ వల్ల చర్మంలో ముడతలు రాకుండా కాపాడుతుంది.

ఒక చెంచా బీట్రూట్ రసం, బాదం నూనె కలిపి మంగుమచ్చల మీద మర్దన చేస్తే అవి తగ్గటానికి ఆస్కారం వుంటుంది.

ఆరోగ్య చిట్కా #148

చర్మం పోడిబారకుండా ఉండటానికి ఓ చిట్కా

2 నుండి 3 చెంచాల బీట్రూట్ రసం, పాలు, బాదం నూనె కానీ లేదా కొబ్బరి నూనె తో కలిపి ముఖం మీద లేదా చర్మం మీద రుద్దుకుంటే చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

అప్పుడప్పుడు ఓ అరగంట ఇలా పెట్టుకొని కడుక్కుంటే సరిపోతుంది.

ఆరోగ్య చిట్కా #149

చర్మం కాంతి వంతంగా మారటానికి ఓ చిట్కా.

బత్తాయి లేదా నారింజ లేదా నిమ్మ తొక్కలను ఎండపెట్టి వాటిని పొడి చేసి ఈ బీట్రూట్ రసంతో కలిపి ముఖం మీద పెట్టుకుంటే ముఖం లేదా చర్మం కాంతి వంతంగా మారుతుంది.

ఆరోగ్య చిట్కా #150

చర్మం మృదువుగా మారటానికి ఓ చిట్కా.

3 చెంచాల బీట్రూట్ రసం, పెరుగు కలిపి ముఖం మీద పెట్టుకుంటే చర్మం మృదువుగా మారటానికి ఆస్కారం వుంటుంది.

ఆరోగ్య చిట్కా #151

చర్మం మంచిగా అలర్జీ లు లేకుండా ఉండాలంటే. కొందరికి బయటకి వెళ్తే దుమ్ము ధూళి క్రిముల వల్ల చర్మం పాడవుతూ ఉంటుంది. కొందరికి అలర్జీల వల్ల చర్మం రంగు మారిపోతూ ఉంటుంది. కొందరికి ఎండ పడక అలర్జీ వస్తుంది. ఇంకొందరికి మొటిమలు, మచ్చలు, మంగుమచ్చలు వస్తూఉంటాయి.

మంచి నల్లటి మట్టి, పసుపు, వేప ఆకుల పొడి, నిమ్మ తొక్కల పొడి కలిపి ముఖం మీద పూసి ఓ అరకంట సేపు ఉంచుకొని కడుక్కోండి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే ముఖం మీద ఉన్న మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

ఆరోగ్య చిట్కా #152

చర్మ సౌందర్యానికి ఉపయోగపడే అరటిపండు చిట్కా. మగ్గిపోయిన (బాగా మాగిన) అరటిపండ్లను పేస్ట్ చేసి చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తే ఎన్నో ప్రయజనాలు చర్మానికి అందించవచ్చు. అరటిపండులో రెటినాల్ (Retinal) కెమికల్ ఉండటం వల్ల మనం ఎండలోకి వెళ్ళినపుడు ఎండ వలన నల్లబడిన చర్మాన్ని మళ్ళీ మాములు స్థితికి తీసుకరావటానికి, చర్మం నల్లపడకుండా కాపాడటానికి ఉపయోగపడుతుంది. అరటిపండులో ఉండే B కాంప్లెక్స్ వల్ల చర్మంలో ఉండే కణాలను త్వరగా కోలుకోవటానికి, ఉత్సాహంగా పనిచేయటానికి ఉపయోగపడుతుంది. అరటిపండులో ఉండే E విటమిన్ చర్మాన్ని మృదువుగా చేయటానికి, ఎండలో ఉండే యూవీ రేస్ (UV Rays) నుండి చర్మ కణజాలాన్ని పాడవ్వకుండా ఉపయోగపడుతుంది. అరటిపండులో ఉండే పొటాషియం చర్మ కణాలలో ఉండే నీటిని ఎక్కువగా బయటకు పోకుండా కాపాడుతుంది. అరటిపండు, కొద్దిగా పసుపు, ఒక కప్పు పెరుగు కలిపి ముఖానికి, వంటికి పూసుకుని ఓ అరగంట తర్వాత కడుక్కోవాలి.

ఆరోగ్య చిట్కా #153

చర్మ సౌందర్యానికి ఉపయోగపడే అరటిపండు తో మరొక చిట్కా.

అరటిపండు, ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మ రసం కలిపి ముఖానికి పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే ముఖంపై వచ్చే నల్లటి మచ్చలు తగ్గటానికి, ఇందులో ఉండే సి విటమిన్ వల్ల చర్మం రంగు పెరగటానికి ఉపయోగపడుతుంది.

ఆరోగ్య చిట్కా #154

చర్మం పొడిబారకుండా ఉండటానికి అరటిపండు చిట్కా. బాగా మాగిన అరటిపండు పేస్ట్ చేసి, అవకాడో పండు పేస్ట్ చేసి, కొద్దిగా తేనె కలిపి ఈ మూడింటిని కలిపి ముఖానికి పెట్టుకుంటే చర్మం పొడిబారకుండా మృదువుగా ఉండటానికి ఉపయోగపడుతుంది.

ఆరోగ్య చిట్కా #155

మొటిమలు తగ్గటానికి, చర్మం కాంతి వంతంగా మారటానికి గంధం చిట్కా.

మొటిమలు రావటానికి ముఖ్యంగా కారణం ప్రొఫియోని బ్యాక్టీరియం (Propionibacterium). మొటిమలు తగ్గటానికి గంధం (చందనం) బాగా పనిచేస్తుంది. గంధం లో ఉండే శాంటలాల్ (santalol), మరియు ఇంకొన్ని కెమికల్స్ ఆ బ్యాక్టీరియా లను చర్మం లోపలికి పోకుండా ఉండటానికి, లేదా బ్యాక్టీరియా లను తొలగించటానికి పనిచేస్తుంది. మంగుమచ్చలు తగ్గటానికి కూడా పనిచేస్తుంది. గంధం పొడిని తేనె తో కలిపి ముఖానికి పెట్టుకోవాలి. లేదా గంధం పొడికి కొద్దిగా పసుపు, తేనె తో కలిపి ముఖానికి పెట్టుకోవాలి.

ఆరోగ్య చిట్కా #156

లంఖనం దివ్య పరమౌషదం. ఈరోజుల్లో ప్రతీ దానికి చిన్న పెద్దా జబ్బులకు అంటే జలుబు, దగ్గు లకు కూడా మనం మందులు వాడుతున్నాం. ఇలా వాడుతూ పోతే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి తగ్గుతూ పోతుంది, చివరకు పనిచేయటం ఆగిపోతుంది. కాబట్టి మన బాడీ కి కొంత సమయం ఇస్తే ఆ బాడీనే జబ్బులను తగ్గించుకోవటానికి పనిచేస్తుంది.

ఒకవేళ డాక్టర్ సలహాతో మందులు వాడినా, ఈ లంఖనం (ఉపవాసం) పాటించవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఉపవాసం అంటే, ఏమి తినకుండా అని కాదు, తినే బదులు మనం నీరు, పండ్ల రసాలు, తేనె మొదలగు వాటితో మనం రోజు మొత్తం ఉపవాసం చేస్తాం. ఇలా చేయటం వలన మనలో ఆంటీబాడీస్ బాగా పెరుగుతాయి. వాటి వలన వైరస్ లతో బాగా పోరాడుతుంది. ఈ లంఖనం 5 సంవత్సరాల వయస్సు వాళ్ళ నుండి 90 సంవత్సరాల వాళ్ళ వరకు అందరూ పాటించవచ్చు.

ఆరోగ్య చిట్కా #157

చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి ఉపయోగపడే స్నానపు పొడి సున్ను పిండి. చెమట, కాలుష్యం, టాక్సిన్స్, వ్యర్థాల నుంచి చర్మాన్ని శుద్ధి చేయటానికి ఇది ఇంతో ఉపయోగపడుతుంది.

సున్ను పిండి ఇంట్లోనే తయారు చేసుకునే విధానం, అందులో ఉండే పదార్థాలు.
  • కస్తూరి పసుపు 100 gms, తులసి gms, వేప ఆకులు 100 gms.. ఈ మూడు ఆంటీ బ్యాక్టీరియల్, ఆంటీ వైరల్ గా పని చేస్తాయి.
  • భావన్ చాలు 100 gms, ఇవి మెలనో సైట్స్ ని రెగ్యులే ట్ చేయటానికి పనిచేస్తుంది.
  • తుంగమస్తుల 100 gms, ఇవి చర్మ దద్దుర్లు, చర్మ దురద తగ్గించటానికి, ఆరోగ్యంగా ఉంచటానికి పనిచేస్తుంది.
  • వట్టి వేర్లు 100 gms, చర్మం తేమను కాపాడుతుంది. చర్మ కణాలు పెరగటానికి సహాయపడుతాయి.
  • నిమ్మ తొక్కల పొడి 100 gms, ఇవి చర్మ కణాలు పాడవ్వకుండా, చర్మం జిడ్డు కారకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది.
  • బత్తాయి లేదా కమల తొక్కలు 100 gms, ఇవి జిడ్డు చర్మాన్ని తగ్గించటానికి పనికొస్తుంది.
  • పెద్ద ఉసిరికాయలు 100 gms, ఇవి చర్మ కణాలలో ఉండే కొలాజన్ జాలిని పాడవ్వకుండా, చర్మం ముడతలు పడకుండా, యవ్వనంగా ఉండటానికి పనిచేస్తుంది.
  • గులాబీ రేకులు 100 gms, ఇవి చర్మం ముడతలు పడకుండా, చర్మ సౌందర్యానికి, సువాసనకు పనిచేస్తుంది.
  • ఉలవలు 100 లేదా 200 gms, చర్మ కణజాలం మంచిగా ఉంచటానికి పనిచేస్తుంది.
  • ముడిబియ్యం లేదా మాములు బియ్యం 250 gms, ఇవి చర్మాన్ని శుద్ధి చేయటానికి, నలుగు రావటానికి, చెమటను, మురికిని పోగొట్టటానికి ఉపయోగపడుతుంది.
  • పెసర్లు 5 kgs, ఇవి మృత కణాలను తీసివేయయానికి పనిచేస్తుంది.
  • కుంకుమ పువ్వు 3 నుండి 4 gms, ఇది చర్మ సౌందర్యానికి పనిచేస్తుంది.
  • గంధం కర్చురాలు 100 gms, ఇది చెర్మం రంగు పెంచటానికి పనిచేస్తుంది.
ఆరోగ్య చిట్కా #158

బొల్లి మచ్చలు, నల్ల మచ్చలు తగ్గాలంటే. చర్మానికి ఏదైనా సమస్య వస్తే అవి తొందరగా తగ్గవు, ఒక్కొక్కసారి తగ్గటానికి సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మన శరీరంలో పెద్ద అవయవం చర్మమే. ఓపికగా మన ఆహారంలో మార్పులు చేస్తే అవి తగ్గే అవకాశం ఉంది.
  1. తరచుగా గోధుమ గడ్డి రసం త్రాగుతూ ఉండండి.
  2. ప్రతీ రోజు ఏదో ఒకటి కూరగాయల రసం త్రాగండి. (క్యారెట్, బీట్రూట్, కీరా, సొరకాయ, టమాట, బీరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ, పాలకూర, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ మొదలగున్నవి)
  3. చర్మానికి కొబ్బరి నూనె రాసి కొద్దిసేపు ఎండకు ఉండటానికి ప్రయత్నించండి.
  4. ప్రతీ రోజు 60 నుంచి 70% ప్రకృతి ఆహారం తినండి. (మొలకెత్తిన విత్తనాలు, డ్రై ఫ్రూయిట్స్, డ్రై నట్స్, పండ్లు, పండ్ల రసాలు, కూరగాయల రసాలు)

ఆరోగ్య చిట్కా #159

అల్లనేరేడు పండు ఉపయోగాలు. యాంటీఆక్సిడెంట్ ఎక్కువగా ఉన్న పండు ఇదే, అందుకే దీనిని అతి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అంటారు. వర్షాకాలంలో ఎక్కువగా అంటువ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ అల్లనేరేడు పండ్లు అంటువ్యాధులు రాకుండా కాపాడుతాయి. ఈ పండ్లు ఎవ్వరైనా తినవచ్చు. ఈ పండు రోగ నిరోధక శక్తికి బాగా ఉపయోగపడుతుంది.

1. ఈ పండ్లు చక్కర వ్యాధి ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే Anthocyanin pigments, మరియు flavonoids ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి మంచిగా పనిచేసేట్ఠట్టు చేస్తాయి.
2. మన కణజాలంలో ఉండే డిఎన్ఏ చెడిపోకుండా కాపాడటానికి, క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా ఉండటానికి ఈ అల్లనేరేడు బాగా ఉపయోగపడుతుంది.
3. 100 గ్రాముల అల్లనేరెడులో 15 gms పిండిపదార్థాలు ఉంటాయి
4. వికారం పోవడానికి కూడా పనిచేస్తుంది.
5. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.


ఆరోగ్య చిట్కా #160

మెడ, నుదురు, చంపలపై చర్మం నల్లగా (నలుపు రంగు) మారుతుంది. వాటికి గల కారణాలు తెలుసుకుందాం.

1. ఊబకాయం ఎక్కువగా ఉన్న చర్మం ఆ భాగాలలో నల్లగా మారుతుంది.
2. చక్కర వ్యాధి వచ్చినా ఇలా అవుతుంది.
3. హైపోతేరైడ్ ఉన్నా
4. అమ్మాయిలల్లో PCOD సమస్యలు ఉన్నా ఇలా జరుగుతుంది.

ఇవి పోవాలంటే సరైన పోషకాహారం తీసుకుంటూ ఉంటే తగ్గుతాయి.


ఆరోగ్య చిట్కా #161

మైగ్రైన్ (పార్శ్వపు నొప్పి) తలనొప్పి రావటానికి ముఖ్యమైన కారణాలు.

1. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం
2. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండటం
3. పొట్ట నొప్పి, వికారం, వాంతులు అవ్వటం
4. మల విసర్జన సరిగా లేకపోవటం
5. నీళ్లు సరిగా త్రాగక పోవటం వల్ల

ఆరోగ్య చిట్కా #162

వంటల వాడకంలో పచ్చి మిర్చీ మంచిదా లేదా ఎండు మిర్చీయా.

పచ్చి మిర్చీ ఏ మంచిది. పచ్చి మిర్చీ, పండు మిర్చీ, మరియు ఎండు మిర్చీ లలో పచ్చి మిర్చీ లో 50% మాత్రమే కారం, ఘాటు ఉంటుంది. పండు మిర్చీ లో 75%, ఎండు మిర్చీ లో 100% కారం, ఘాటు ఉంటుంది. మిర్చీ ఎండుతున్నాకొద్దీ వాటిలో ఉండే నీరు తగ్గుతుంది, దాని వల్ల కారం, ఘాటు పెరుతుతుంది. మనం వండినపుడు కొంత కారం, ఘాటు తగ్గుతుంది. వంటలలో పచ్చి మిర్చీ వాడుకోండి. అప్పుడప్పుడు మాత్రమే ఎండు మిర్చీ వాడుకోండి.

ఆరోగ్య చిట్కా #163

బ్లడ్ క్యాన్సర్ కు బెస్ట్ మెడిసిన్ గోధుమ గడ్డి రసం. ఈ రసం త్రాగటం వల్ల క్యాన్సర్ కణాలను చంపుతుంది. రక్తము పెరగటానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ క్యాన్సర్ ఉన్నవాళ్లు 150 ml చొప్పున రోజుకు 3 సార్లు త్రాగుతూ, మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటే బ్లడ్ క్యాన్సర్ త్వరగా తగ్గటానికి ఆస్కారం ఉంది.

ఆరోగ్య చిట్కా #164

 రాజ్మా గింజల ఉపయోగాలు. ఇవి అధిక B కాంప్లెక్స్ ఫోలిక్ యాసిడ్ ఉన్న గింజలు. B కాంప్లెక్స్ మన శరీరానికి బలానికి, నరాలు సరిగా పనిచేయటానికి ఉపయోగపడుతుంది. B9 విటమిన్ ఫోలిక్ యాసిడ్ కొత్త కణాల నిర్మాణానికి బాగా ఉపయోగపడుతుంది. మనకు రోజుకు 400 మైక్రోగ్రామ్స్ సరిపోతుంది, అదే గర్భిణులకు రెట్టింపు (600 నుండి 800 mcg) కావాలి. 100 గ్రాముల రాజ్మా గింజలలో అధికంగా 316 మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్, 20 గ్రాముల ప్రోటీన్, 1332 మైక్రోగ్రామ్స్ పొటాషియం, 16 గ్రాముల పీచు పదార్థాలు ఉంటుంది. అప్పుడప్పుడు రాజ్మా గింజలను కూరల రూపంలో తింటూ ఉండండి, గర్భిణులకు ఫోలిక్ యాసిడ్ బదులు ఇవి ఆహారంలో పెట్టండి.

ఆరోగ్య చిట్కా #165

అవిసె గింజలు - రక్త నాళాలలో పూడికలు, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా కాపాడే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. చెడు క్రొవ్వు రక్త నాళాలలో పేరుకోకుండా ఉండటానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఆల్ఫాలెనోలెనిక్ అనే మంచి క్రొవ్వు ఉంటుంది. అవిసె గింజలు చెడు క్రొవ్వును తగ్గించి, మంచి క్రొవ్వును పెంచుతుంది. ఇందులో 550 కేలరీస్ శక్తి, 18 గ్రాముల ప్రోటీన్, 42 గ్రాముల క్రొవ్వు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.  ఇవి బ్రెయిన్ స్ట్రోక్స్, రక్త నాళాలలో కొవ్వు పేరుకోకుండా, గుండెపోటు రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇవి బీపీ తగ్గటానికి కూడా పనిచేస్తాయి. ఇవి రోజుకు 25 నుంచి 30 గ్రాముల వరకు తీసుకోవచ్చు. ఇవి అవిస లడ్డు రూపంలో కానీ, మాడ్చిన కారం రూపంలో కానీ, వేయించి పొడిచేసుకొని కూరలల్లో కూడా వాడుకోవచ్చు.

ఆరోగ్య చిట్కా #166

మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరగాలంటే ఏ ఆహారపదార్ధాలు తినాలి. పొట్టు తీయని ధాన్యాలలో ఆల్ఫాలెనోలెనిక్ యాసిడ్ ఉంటుంది, ఇది మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది.
  1. ముడిపదార్దాలు (పాలిష్ పట్టని బియ్యం, గోధుమ, గింజలు), మొలకెత్తిన విత్తనాలు తినాలి.
  2. పొట్టు తీయని పప్పులు తినాలి
  3. డ్రై ఫ్రూట్స్ (బాదం, ఆక్రూట్, పొద్దు తిరుగుడు గింజలు, పిస్తా, పుచ్చకాయ గింజలు), రాజ్మా, అవిస గింజలు
  4. రోజు ఆకుకూరలు తినాలి
ఆరోగ్య చిట్కా #167

రోగాల బారిన పడకుండా ఉండాలంటే. మనం తినే ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉండాలి. కూరగాయల విశిష్టత అలాంటిది. మనం తినే భోజనంలో 50 నుంచి 70% కూరగాయలు ఉండాలి. అంటే రైస్ ఎంత ఉంటదో దానికంటే కూరలు ఎక్కువగా తినేతట్టు చూసుకోవాలి. చాలామంది ఏ పావు కిలోనో, అరకిలోనో కూరతో రోజు మొత్తం సరిపెట్టుకుంటారు. అలాకాకుండా నలుగురు ఉన్న ఇంట్లో కనీసం కిలో లేదా కిలోన్నర కూరనన్నా వండుకోవాలి. అది కూడా నేచురల్ పద్దతిలో వండుకోవాలి, అప్పుడే అన్నీ పోషక విలువలు మన బాడీకి అందుతాయి. అందులో ఇప్పు, నూనె, మసాలాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. రోజుకు రెండు కూరగాయలు వండుకుంటే ఇంకా మంచిది, ఒకటి ఆకుకూర, రెండవది మాములు కూరగాయల కూర. కనీసం వారంలో నాలుగు రోజులు ఆకుకూరలు తినేతట్టు చూసుకోండి.

ఆరోగ్య చిట్కా #168

పిల్లలకు మంచి ఎనర్జీ కావాలంటే. చాలామంది పిల్లలకు పాలల్లో బయట కొన్న ఎనర్జీ పొడులు కలిపి ఇస్తూఉంటారు. వాటికి బదులు ఇంట్లోనే మంచి ఎనర్జీ పొడి తయారు చేసి ఇవ్వొచ్చు, అదే మొలకలు పొడి. శనగలు, పెసర్లు మొదలగున్నవి మొలకలు కట్టి వాటిని ఎండపెట్టి పొడి చేసి పెట్టుకోవాలి, అలాగే బాదం, జీడిపప్పు, పిస్తా దోరగా వేయించి వాటిని కూడా పొడి చేసి పెట్టుకోవాలి. వాటిలోకి ఎండు ఖర్జురం పొడి, సువాసన, రుచికి కొద్దిగా యాలకుల పొడి. ఇలా మొలకల పొడి, డ్రై ఫ్రూట్స్ పొడి, ఖర్జురం పొడి, యాలకుల పొడి అన్నీ కలిపి సీసాలో పెట్టుకోండి. ఈ పొడి రోజూ కొద్దికొద్దిగా పాలల్లో తేనెతో కలిపి తీసుకుంటే వాళ్లకు మంచి పోషక విలువలు వస్తాయి.

ఆరోగ్య చిట్కా #169

బ్లడ్ ప్లేట్లెట్స్ త్వరగా పెరగటానికి ఉపయోగపడే అద్భుతమైన జ్యూస్ - బొప్పాయి (పొప్పడి పండు) ఆకు రసం. బొప్పాయి ఆకులు, కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసి వడకట్టి తేనెతో కలిపి తీసుకుంటే త్వరగా ప్లేట్లెట్స్ పెరుగుతాయి.

ఆరోగ్య చిట్కా #170

తుమ్మి మొక్క ప్రయోజనాలు, ఈ మొక్క చాలా ప్రత్యేకమైనది. ఈ తుమ్మి మొక్క ప్రత్యేకంగా వినాయక చవితికి వస్తుంది, దీనిని ద్రోణ పుస్పి అని కూడా అంటారు. ఈ మొక్క ఆకులను కూర, పచ్చడి రూపంలో కూడా తింటారు. ఈ మొక్క మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. ఈ వినాయక చవితికి తుమ్మి ఆకులను వినియోగించుకోవాలని కోరుతున్నాను.
  1. ఈ ఆకులు సొరియాసిస్, చర్మ వ్యాధులు తగ్గించటానికి పనిచేస్తుంది
  2. కామెర్లు, కీళ్ల నొప్పులు, కాలేయ వ్యాధులు తగ్గటానికి పనిచేస్తుంది
  3. సంతాన లేమిని తగ్గిస్తుంది
  4. ఆడవాళ్ళలో వచ్చే బహిష్టు సమస్యలను తగ్గిస్తుంది
  5. ఈ మొక్క కఫ, వాత వ్యాధులను తగ్గిస్తుంది
ఆరోగ్య చిట్కా #171

పిల్లల్లో మూర్ఛ (ఫిట్స్) రాకుండా ఉండాలంటే. ఫిట్స్ ఎక్కువగా నీళ్లు త్రాగని వారిలో వచ్చే అవకాశం ఉంది. బాడీలో క్యాల్షియం తగ్గినా వచ్చే అవకాశం ఉంది. మార్చ త్వరగా తగ్గటానికి ఈ క్రింది వాటిని పాటించండి.
  1. నీళ్ళు బాగా త్రాగేటట్టు చూసుకోండి.
  2. రోజు చల్లటి నీటితో తల స్నానం చేయించండి, దీని ద్వారా మెదడులో రక్త నాళాలు చురుకుగా పనిచేస్తాయి.
  3. రోజుకు రెండు పండ్ల రసాలు త్రాగించండి.
  4. పండ్లు బాగా తినబెట్టండి.
  5. నువ్వుల లడ్డు తరచుగా తినబెట్టండి.
ఆరోగ్య చిట్కా #172

పిల్లల్లో హైపర్ ఆక్టివిటీ తగ్గాలంటే. పిల్లల్లో జింక్ లోపం ఉన్న వాళ్లకు ఎక్కువగా హైపర్ ఆక్టివిటీ ఉంటుంది. గుమ్మడికాయ గింజలు నానబెట్టుకొని తినాలి. ఇంకా గుమ్మడికాయ గింజలను వేయించి పొడి చేసి కూరలల్లో వేసుకుంటే కూడా ఫలితం ఉంటుంది. లేదా ఆ పొడితో మాడ్చిన కారం తయారుచేసుకొని వాడుకోవచ్చు.

ఆరోగ్య చిట్కా #173

తలలో పేలు తగ్గాలంటే ఏమిచేయాలి. తలకు వేప నూనె (Neem Oil) ను పెట్టి అరగంట సేపు ఉంచి తల స్నానం చేస్తే పేలు పోతాయి. లేదా వేప ఆకులను దంచి పసరు తీసి గంట సేపు తలకు మర్దన చేసి పట్టించాలి, తర్వాత తల స్నానం చేస్తే పేలు పోతాయి.

Post a Comment

3 Comments