Health
Health is the first thing a man wants to do. Without health no work can be done properly. Whom to contact and how to know about health. The are some websites provides all these details. In this mainly WHO and Ayurveda, nature and etc., in particular.
Image from Page Design Shop |
The following websites provide that information.
- Ayurvedic Centres
- Health Benefits
- Manthena Satyanarayana Raju AROGYALAYAM
- National Institutes of Health
- National Institute of Nutrition
Health Benefits times.com
India's premier nutrition research institute working under the aegis of Indian Council of Medical Research (ICMR), Ministry of Health and Family Welfare.
- Naturo Heal - Vegiraju Krishnam Raju, Bhimavaram
వైద్య శాలలు:
AP:
- Nadi Vaidyam, Sanathan Jeevan Trust, ILTD Colony, AR Nagar, Kothapeta, Chirala, Andhra Pradesh 523157.
Watch below expert Videos (Must Watch):
- జబ్బులు రాకుండా ఎలా జీవించాలి | How to Control Diabetes,BP in Telugu | VaraPrasadReddy
- షుగర్ పేషెంట్స్ ఈ తప్పుచేస్తే జీవితాంతం భాదపడాల్సిందే | Reduce Diabetes | VaraPrasadReddy
- డ్రగ్ మాఫియా పై యుద్ధం ఎందుకు అంటే? - TRS Sr Leader Veeramalla Prakash Rao
- రిఫైన్డ్ ఆయిల్ కంపెనీలు చేసేది పెద్ద స్కాం- Veeramachaneni Fires on Refined Oil Companies | NTV
- Reality of Refined Oil | Cooking Oil
******
మనం ఎంతో తెలివైనవాళ్ళం అని అనుకుంటుంటాము. అన్నీ మనకు తెలుసు అని అనుకుంటాము. చివరికి చూస్తే అన్నీ తప్పులే ఉంటాయి. అలాగే ఆరోగ్యం మరియు ఆహారం విషయంలో కూడా అలానే పొరపాటు చేస్తుంటాము.
ఏది పడితే అది తినేసి ఆరోగ్యం బాగుండాలి అని కలలు కంటుంటాము.
ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి మీ ముందు కొన్ని సేకరించిన మెసేజ్ లు ఉంచుతున్నాను. వాటిని శ్రద్ధగా చదివి నిజానిజాలు ఏమిటో మీరే గ్రహించండి.
ఈ మెసేజ్ లు ఎవరు రాసారో తెలియదు కానీ చాలా అద్భుతంగా ఆలోచింపచేసే రీతిలో ఉన్నాయి.
******
******
అన్నీ మంచి అలవాట్లే… ఐనా క్యాన్సర్….?
ఏజ్ - 30 సిగరెట్ లేదు.. మందు లేదు… గుట్కా లేదు…. అసలే చెడు అలవాట్లు లేవు… పైగా రోజూ ఎక్సర్ సైజ్… అప్పుడప్పుడు యోగా… అయినా… ఏం జరిగిందో తెలుసా….?
ఏదో చిన్న సమస్యతో టెస్ట్ లు చేయించుకుంటే క్యాన్సర్ ఉందంటూ… షాకింగ్ న్యూస్….!
ఇదెలా.. ఎలా.. ఎలా..?
ఆ యువకుడు తలలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు… ఇలా మన దేశంలో …. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎందరో…? ఇంతకీ అన్నీ మంచి అలవాట్లే ఉన్నా… చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ ఎందుకు వస్తోంది…? అసలు కారణమేంటి…?
మన తండ్రులు, తాతలు ఇప్పటికీ అరవైలు, ఎనభైల్లోనూ ఉల్లాసంగా ఉంటే.. మన తరానికే ఏంటీ మాయరోగాలు…?
వెరీ సింపుల్… పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా… మనం తినే తిండీ, తాగే నీరు, పీల్చేగాలి అన్నీ కాలుష్యమయం, రసాయనాలమయం…
పొద్దున్నే ప్లాస్టిక్ బ్రష్, బ్రిస్టల్స్… దాని మీద కృత్రిమ రసాయనాలు.. ఇంకా వీలైతే బొమికల పొడి, రసాయనాలు కలిపిన పేస్టులు…
ఇక అలా మొదలైతే.. ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి వేడి టిఫిన్లు… తాగే నీళ్ల బాటిల్ నుంచి నిల్వ ఉంచే ప్రతి ఆహార పదార్థాలు ప్లాస్టిక్… అలా 24 గంటలూ.. 365 రోజులు ప్లాస్టిక్ జీవితం గడుపుతున్నాం… బై వన్ … గెట్ వన్ లాగా…
ఒక దరిద్రానికి … మరో దౌర్భాగ్యం ఫ్రీ అన్నట్టు… పాలు, పండ్లు, కూరగాయలు వీటిల్లో రసాయనాలు… పురుగుల మందులు ఎక్స్ ట్రా… ఇలా కూడా క్యాన్సర్ కారకాలు సరిపోవు అనుకునేవాళ్లు…
పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్ లు… ఇప్పుడు చెప్పండి… 30 ఏళ్లకే క్యాన్సర్ ఎందుకు రాకూడదో….?
- మరి.. అప్పటివాళ్లు ఎందుకు గట్టిగా ఉన్నారు….?
ఒక్కసారి చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకోండి.. అమ్మమ్మ ఇంట్లోనో.. నానమ్మ ఇంట్లోనో మీ బాల్యం ఎలా గడిచేది…?
వేపపుల్లతో తోముకున్నాం.. లేదంటే… పళ్లపొడి చేతిలో వేసుకుని వేలితో శుభ్రంగా పళ్లుతోముకోవటం… తర్వాత… సున్నిపిండితో స్నానం… ఇత్తడి కంచాల్లో భోజనం, రాగి గ్లాసులు, చెంబుల్లో నీళ్లు..
ఇంటి పెరట్లోనే ఉన్న గేదెల నుంచి ఆరోగ్యకరమైన పాలు… ఏ కాలుష్యం లేని వేపచెట్టు గాలి… ఇంకా ఆటలు,ఈతలు… అప్పట్లో… అసలు ప్లాస్టిక్ బకెట్ తో స్నానం చేసినట్టు గుర్తుందా…?
ఇత్తడి గంగాళాలు, నీళ్లు కాచుకోవటానికి రాగి బాయిలర్ లు… ఇంట్లో లేదా పొలం నుంచి వచ్చిన తాజా కూరగాయలు…
బాగా ఆడిపాడి… పుష్టికరమైన ఆహారం తిని.. ఆరుబయట గాలిలో… నులకమంచం లేదా నవారు మంచం మీద నిద్ర… నో ఏసీ… నో …కూలర్…..
ఇలా ఒకటా రెండా… అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లే.. సో… మరి వందేళ్లు బతకమంటే ఎందుకు
బతకరు మరి…!
కాబట్టి ఇప్పుడు చెప్పండి… క్యాన్సర్ మనల్ని కబళిస్తోందా…? మనమే రెడ్ కార్పెట్ వేసి మరీ దానిని ఆహ్వానిస్తున్నామా….? ఆధునికత మంచిదే…..
కానీ… అది మరీ మనల్ని మనమే చంపుకునేంత గొప్పది కానంత వరకే…!
*****
అసలైన ఆరోగ్యానికి సిసలైన అవసరాలు, ఆచరణలు.
1. వెలుగొచ్చేవరకు పరుండటంమాని, వేకువ జామునే లేవడం మంచిదను!
2. బెడ్ కాఫీలు మాని, పరగడుపున ఎక్కువ మంచినీరు మంచిదను!
3. పేపరు పై మనస్సు మాని, సుఖవిరేచనం పై మనస్సు మంచిదను!
4. నడకే శ్రమ అనడం మాని, ఆసన ప్రాణాయాయాలు మంచిదను!
5. చెమట పట్టకుండా తినడం మాని, చెమట పడితేనే తినడం మంచిదను!
6. వేడి నీరు స్నానం మాని, ఉదయం చన్నీళ్లు తలకు మంచిదను!
7. సబ్బులు, షాంపూలు మాని, గుడ్డతో చర్మం మర్దన మంచిదను!
8. పూరీలు, దోసెలు మాని, మొలకెత్తిన విత్తనాలు మంచిదను!
9. పచ్చి కొబ్బరిని కొవ్వు అనడం మాని, సంపూర్ణాహారం అనడం మంచిదను!
10. తినేటప్పుడు నీరు త్రాగడం మాని తినే అరగంట ముందు అరలీటరు నీరు త్రాగటం మంచిదను!
11. కష్టంగా జీర్ణమయ్యేవి రాత్రికి మాని, ఉదయం తినడం మంచిదను!
12 . ముత్యాల్లాంటి మర బియ్యం మాని, ముడి బియ్యం మంచిదను!
13. కూరలకు తొక్కలు తీయడం మాని తినడం మంచిదను!
14 . కూరలను వేయించడం మాని, కొద్దిగ ఉడక నివ్వడం మంచిదను!
15. కూరలలోని నీటిని వార్చడం మాని, త్రాగడం మంచిదను!
16. పచ్చికూరలు పడవు అనడం మాని, సహజారోగ్యానికి మంచిదను!
17. భోజనం చేసేటప్పుడు మాటలు మాని, మనస్సు పెట్టి తినడం మంచిదను!
18. అన్నంలో కూర కలపడం మాని, కూరలో అన్నం కలపడం మంచిదను!
19. ఆహారాన్ని నమలకుండా మ్రింగడం మాని, పదేపదే నమలడం మంచిదను!
20. భోజనం అయ్యాక నీరు మాని, భోజనం అరిగాక త్రాగడం మంచిదను!
21. పగటి పూట నిద్దర మాని, రాత్రికి గాఢ నిద్ర మంచిదను!
22. ఖరీదుగల హైబ్రీడు పళ్ళు తినడం మాని, సహజమైన పళ్ళు తినడం మంచిదను!
23. పళ్ళు రొంప అనడం మాని, రోగనిరోధకానికి మంచిదను!
24. పళ్ళలోని పిప్పి ఊసి వేయడం మాని, అది మింగడం మంచిదను!
25. రసాలను త్రాగడం మాని, నమలడం మంచిదను!
26. పనికి రాని కాలక్షేపం మాని, మనస్సుకు దైవ చింతన మంచిదను!
27. గదులలో మగ్గడం మాని, ఎండ తగలడం రోగనిరోధకానికి మంచిదను!
28. ఫ్యాన్లు, ఏ.సి.లు మాని, చెమట పడితే ఆరోగ్యానికి మంచిదను!
29. పలుమార్లు విరేచనం బలహీనమని మాని, 3,4 సార్లు సాఫీగా అవడం మంచిదను!
30. పైకి పౌడర్లు, అత్తరు పూత మాని, రెండు పూటలా స్నానం మంచిదను!
31. పొద్దుపోయాక భోజనం మాని, పొద్దు ఉండగానే భోజనం మంచిదను!
32. ఉన్నదని తినడం మాని, శ్రమకు తగిన తిండి మంచిదను!
33. రాత్రికి పీకల దాకా తినడం మాని, ఫ్రీగా తినడం మంచిదను!
34. రాత్రికి సినిమాలు, షికార్లు మాని, సత్ సాంగత్యము మంచిదను!
35. తిని పడుకోవడం మాని, అరిగాక పడుకోవడం మంచిదను!
36. కృత్రిమమైన ఆహారాలు మాని, సహజ దేహానికి సహజాహారం మంచిదను!
37. ఫ్రిజ్ ల వాడకం మాని పళ్ళు, కూరలకు గాలి, వెలుతురు మంచిదను!
38. రోజూ బీరు, కూల్ డ్రింక్స్ మాని, కనీసం 6 లీటర్ల మంచినీరు మంచిదను!
39. ముప్పు తెచ్చే ఉప్పును తాకటం మాని ఆహారంలో ఉన్న ఉప్పే ఆరోగ్యానికి మంచిదను!
40. కఫాన్ని పెంచే పంచదార, బెల్లాలు మాని, అన్ని విధాలా తేనె వాడటం మంచిదను!
41. చింతపండు వాడకం మాని, పచ్చి చింతకాయ వాడకం మంచిదను!
42. ఎండు మిర్చిని వాడడం మాని, గుణాలు గల పచ్చి మిర్చి మంచిదను!
43. అపకారం చేసే నూనె, నేతులు మాని, నేటి కాలానికి ఇది మంచిదను!
44. మషాలాలు ఆహారంలో మాని, మందుగా వాడటం మంచిదను!
45. చీటికి మాటికి మందులు మాని, అత్యవసరానికి మంచిదను!
46. రుచులతో రోజూ తినడం మాని, పెళ్ళి పండుగులకు మాత్రమే మంచిదను!
47. జీవాలను తినడం మాని, సత్వాన్నిచ్చే సాత్విక భోజనం మంచిదను!
48. "రుచులను తిననివాడు మనిషా" అనడం మాని, మనిషి అదుపులో రుచి మంచిదను!
49. రోగాలు లేవని రుచులను తినడం మాని, రోగాలు రాకుండా ఆహారం తినడం మంచిదను!
50. రోగం వచ్చాక తినడం మాని, ఉపవాసం చెయ్యడం మంచిదను!
51. ఆకలి లేనప్పుడు ఆహారం మాని, నీరు త్రాగడం మరీ మంచిదను!
52. "ఛీ! ఎనిమా" అనడం మాని, రోగానికి ఎనిమా మంచిదను!
53. ప్రకృతి వికృతి చేయడం మాని, ప్రకృతి ఆరోగ్యానికి మంచిదను!
54. రోగం తగ్గే వరకే ప్రకృతి చేయడం మాని, జీవితకాలం ఆచరించడం మంచిదను!
55. బాధ్యతలు తీరే వరకు బ్రతికితే చాలు అనడం మాని, 100 సంవత్సరాలు బ్రతకాలని కోరడం మంచిదను!
56. అసంతృప్తిని మాని, తృప్తి ఆరోగ్యానికి మంచిదను!
57. కోపం, ఈర్ష్య, చిరాకులు మాని, శాంతం ఆరోగ్యానికి మంచిదను!
58. ఎదుటవారితో చేయించుకోవడం మాని, మన పని మనమే చేసుకోవడం మంచిదను!
59. సాటివారిని ద్వేషించడం మాని, ప్రేమించడం ఆరోగ్యానికి మంచిదను!
60. ప్రకృతి విధానాన్ని వైద్యం అనడం మాని, జీవన విధానం అనడం మంచిదను.
*****
ఈ క్రింది ఔషధాలు ఎప్పటికీ మందుల షాపులలో దొరకవు.... పైగా పైసా అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా కూడా వస్తాయి.
- శారీరక శ్రమ, వ్యాయామమే ఔషధం.
- ఉపవాసం ఔషధం.
- సహజ ఆహారమే ఔషధం.
- నవ్వు, ప్రశాంతత ఔషధం.
- సహజ కూరగాయలు, పండ్లు ఔషధం.
- నిద్ర ఔషధం.
- సూర్యకాంతి ఔషధం.
- ఎవరినైనా స్వార్ధ రహితంగా ప్రేమించడం ఔషధం.
- ప్రేమించబడడం ఔషధం.
- కృతజ్ఞత అనేది ఔషధం.
- సదాచారం, సదాలోచన ఔషధం.
- ధ్యానం ఔషధం.
- మంచి స్నేహితులే ఔషధం.
ఈ ఔషధాలను తగినంతగా మీఅంతకు మీరే సంపాదించుకోవాలి,
పై ఔషధాలు సంపాదించుకుంటే, బజారులో ఉండే మందుల షాపులో ఉండే ఔషధాలతో అవసరమే ఉండదు.....👍
యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి
ఇవే అష్టాంగ యోగ అంటే.
*****
☘️☘️☘️
మనపై ఉన్న ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు
🎊💦🦚🍇🥀🌺🌷
👉🌱1. ఒక రోజు ఒక సమయంలో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
👉🌱2. నీ ఒత్తిడిని గమనించుకో, ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
👉🌱3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించగలదని గుర్తించుకో !
👉 🌱4. నీ ఆహారంలో పళ్ళూ, కాయగూరలూ, నీరు తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !
👉🌱 5. కక్ష కన్నా క్షమ గొప్పది, క్షమ కన్నా *జీవుల పట్ల కరుణ* గొప్పదని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !
👉🌱 6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !
👉 🌱7. నవ్వును దగ్గరకు తీసుకో, ఇతరులతో నీ భావాలు పంచుకో !
👉🌱 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి. రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో !
👉🌱9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !
👉🌱 10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో !
👉🌱11. *మద్యానికి, మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు. అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో* *శాకాహారిగా* ఉండడం *ధ్యానం* చేయడం నేర్చుకో!
👉🌱12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు. నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యడం నేర్చుకో !
👍🌱13. నాకు వద్దు, నాకు రాదు, నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !
👉 🌱14. బయటకు వెళ్ళు. మిత్రులతో, బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం, సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో !
👉🌱 15. *టీవి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో* !
👉🌱16. *పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో* !
👉🌱17. బంధాలను పెంచుకో, కాపాడుకో, ఎక్కువ విను, తక్కువ మాట్లాడటం నేర్చుకో !
👉🌱18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో !
👉🌱 19. వారానికి ఒక్కసారి ఉపవాసం; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం చూడడం నేర్చుకో !
👉🌱 20. విషయాలను నీ కోణం నుండి కాకుండా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !
👍🌱21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో !
👉🌱22. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ, మంచిగా కానీ పూర్తి కావు. అని గుర్తించుకో !
👉🌱23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !
👉🌱24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !
👉🌱25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.
👉🌱 ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు.
👉🌱 నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు.
☘️☘️☘️
******
"ఎవరు రాశారో కాని చాల బాగుంది",
పచ్చి నిజాలు / Golden facts
ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం..
ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది.
జీవితం కూడా అంతే...
ఏంజాయ్ చేసి నా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది.
• తర్వాత నరకం, స్వర్గం అంటారా?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు.
• ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది.
ఫైనల్ గా చెప్పదేంటంటే...
టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త.
• ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా?
• లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా!.
• ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!
• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం.
• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం.
• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం.
• అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం.
• భార్య చూసే ఓర చూపు ఐశ్వర్యం.
• పచ్చటి చెట్టు, పంటపొలాలు ఐశ్వర్యం.
• వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం.
• పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం.
• మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం.
• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం.
• ప్రకృతి అందం ఐశ్వర్యం.
• పెదాలు పండించే నవ్వు ఐశ్వర్యం.
• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు ఐశ్వర్యం.
• బుద్ధికలిగిన బిడ్డలు ఐశ్వర్యం.
• బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం.
• భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం.
• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి ఐశ్వర్యం.
• పరులకు సాయంచేసే మనసు మన ఐశ్వర్యం.
• ఐశ్వర్యం అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు.
• కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం.
• మనసు పొందే సంతోషం ఐశ్వర్యం
అలోచించండి ఆచరించే ప్రయత్నం చేయండి, పది మందికి పంపించండి.
ధన్యవాదాలు.....
******
నీ ఈజీవితంలో అసలైనతోడు ఎవరు?
అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బంధువులా ?
లేదు.ఎవరూ కాదు.!
నీ నిజమైన తోడు నీ శరీరమే!
నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్న, ఎంతమంది డాక్టర్ లు ఉన్న, జనాలు ఉన్న ఏమి చెయ్యలేరు సాగనంపడం తప్ప.
ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!!
నువ్వు అవునన్నా, కాదన్నా, ఇది కఠిన నిజం.!!!
నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు.
ఏదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో, నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది.
నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.
గుర్తించుకో !
నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా!
నీ శరీరమే నీ ఆస్థి,సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.
నీ శరీరం నీ బాధ్యత...
డబ్బు వస్తుంది.వెళ్తుంది.
బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు.
గుర్తుంచుకో.!
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.
ఒక్క నీవు తప్ప...!
ఊపిరితిత్తులకు - ప్రాణాయామం.
మనసుకు - ధ్యానము
శరీరానికి - యోగా.
గుండెకు - నడక.
ప్రేగులకు - మంచి ఆహారం.
ఆత్మకు - మంచి ఆలోచనలు.
ప్రపంచానికి - మంచి పనులు ...................... -
******
ReplyForward |
2 Comments
Good information ra Naveen
ReplyDeleteGood one
ReplyDelete