మిద్దె తోట | Terrace Garden

 మిద్దె తోట | Terrace Garden

ఒకప్పుడు ప్రతీ ఇంట్లో మొక్కలు పెంచుకోవటానికి ఇంటి వెనకాలే పెరడు ఉండేది. చాలా మొక్కలు ఇంట్లోనే ఉంటుందడేవి. తులసి, కరివేపాకు, మునగ, జామ, బొప్పాయి, గోరింటాకు, దానిమ్మ లాంటి మొక్కలు, చెట్లు ఇంటి పెరట్లోనే ఉండేవి, కానీ ఇప్పుడు అసలు పెరడు అనేదే లేదు, పట్టణాలలో ఉండటానికే ప్రదేశం ఉండటంలేదు, ఒకవేళ ఉన్నవాళ్లు, ఇండ్లు కిరాయికి ఇవ్వటానికి మిద్దె మీద మిద్ద కడుతున్నారు. మొక్కలు పెంచుకోవటానికి కాలీ ప్రదేశమే ఉండటం లేదు. దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు.

Image from OrganicBazar

కానీ ఇప్పుడు ప్రజల్లో కొంత అవగాహన పెరుగుతూ ఉంది. మొక్కలు పెంచుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే బయట మార్కెట్లో కొనే పండ్లు, కూరగాయలు పూర్తిగా పెస్టిసైడ్, కెమికల్ మయం అయిపోయాయి. బాల్కనీ, మిద్దెమీద మొక్కలు, కూరగాయలు పండిస్తున్నారు. సహజమైన పంటలను పండించుకునేందుకు ఇష్టపడుతున్నారు. గోఆదారిత మరియు సేంద్రియ ఎరువులతో పంటలను పండిస్తున్నారు. అలా ప్రతీ ఒక్కరూ సేంద్రియ ఎరువులతో పంటలను పడిస్తే అసలు రోగాలే దరిచేరవు. పొలాలు లేని వారు ప్రతీ ఒక్కరూ మిద్ద తోటలను లేదా బాల్కనీ లలో చిన్న చిన్న మొక్కలను, కూరగాయలను పండించుకుంటే మళ్లీ అందరూ ఆరోగ్యంగా జీవించగలుగుతారు.


Below are the few useful links about Terrace Garden:

Organic or Natural Farming:

Nature - Youtube Channels:

    1. Muralidhara Godhamam, Ph.9849750854. ఆవు పేడ ఎరువు (బాగా మాగిన), వర్మి కంపోస్ట్, వేప పిండి, గణజీవమృతము, ద్రవ జీవామృతం, మేక /గొర్రె ఎరువు, ఆవు పేడ పిడకలు, గోమూత్రం, లోకల్ దేశి కూరగాయల విత్తనాలు.(70 రకాలు), దశ పర్ని కషాయం, పంచగవ్య, అగ్ని హాస్త్రం, వేప నూనె, వేప పిండి, కోకో పిట్. హోమ్ డెలివరీ, ఆర్డర్స్ sms to 9849750854.
    2. Raitu Nestam Natural Products, (సహజ, సేంద్రీయ ఉత్పత్తుల కోసం సంప్రదించండి) People’s Hospital Ground Floor, Opp Metro Pillar No- 817, Kukatpally, Hyderabad, Telangana, 500072. ph.+91 9069073999, Kukatpally ph.9908815432, Kiratabad ph.9963978757, Guntur ph.9705858899, Vijayawada ph.9177705977
    3. Archana, for Grow bags, Vermi Compost, Dilsukhnagar, Hyderabad ph.9985816565

List of Organic or Natural Farmers:

    Telangana:

    1. Ashok Rastapuram, Gundala, Mahaboobnagar. ph.8639504782
    2. Harekrishna Divine shop, Desi cow based products, Natural Farming products. Gokul Nagar, Bhainsa, Nirmal district, Telangana. Mahesh Someshetty ph.9951382831
    3. Manoher Chary V, Shadnagar, near Parigi ph.9966984871
    4. Mokshaam Farmz, Srikanth Adepu, Keesara gutta, Hyderabad. ph.9533669583
    5. Nature Kisan Farming, Baskara Golkonda ph.7569185418, 9949707795. (available: Rice, Vegetables, oils, Mirchi, Turmeric powder, Ghee, Honey etc.,) facebookBhaskara Golkonda
    6. Parvati Tolety, Natural Farming. Absiguda (Natural form: Khamam) ph.9666094662
    7. Samb Siva Tumuluru, SS Naturals Agro Services ph.9494212629, 9885942748
    8. Saraswathi Kavula, Neknampur ph.7995792102 (available: Mangos)
    9. Shakti Yug Farms, Rampalli Village, Ghatkesa, Hyderabad
    10. Srivanitha Mythili, Haripuram village, Muttharam mandal, Peddapalli, Telangana. ph.8919901295 YoutubeFarmer Mythili
    11. Venkat Reddy, Jillelaguda, Hyderabad (Organic form: Veldanda, Nagarkunool) ph.9666670922 (available: Drumstick, Jamoon, Vegetables, Banti flowers etc.)
    12. Uma Reddy, Panjagutta. Organic form Parigi. ph.9849627594
    AP:
    1. A. Gopinatha Reddy, Uppalapadu (V), Orvakur (M), Kurnool, AP - 518002. ph.9885979659
    2. GoSahaja, Satyanarayana Vutukuru, Gurrappathota village, Pellakur Mandal, Tirupati dist. ph.9885047684 (available: Rice, Cold pressed oils, Natural pickles, Desi Ghee, Panchagavya related items)
    3. Gow Aadaritha Prakruti Vyavasaya Kshetram, Lingamguntla Village, Chilakaluripet Mandal, Palnadu district. ph.9885790079
    4. Kshetra Farmer, Bapatla. Lella Venkata Ramanarao ph.9246502283 (available: Rice etc.)
    5. Prakruti Vyavasaya Kshetram, Uppada, Kothapalli, East Godavari dist. Suresh Avani, ph.9949627441 (available Rice, Rice flakes)
Misc:

కొన్ని రకాల చెట్ల పై భాగం చీడపీడలు వస్తూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి -  ఎఫిడ్స్, పిండి నల్లి/మీలి బగ్స్ - నివారణ గా వంట సోడా ద్రావణం, కుంకుడు ద్రావణం చల్లాలి!  తెల్ల, పచ్చ దోమలు, పేను  బంక,  రసం పీల్చే పురుగులు, ఫంగస్ వగైరాలు. వీటికి నివారణగా పుల్లటి మజ్జిగ ద్రావణం, కుంకుడు ద్రావణం వాడాలి, కట్టె బూడిద చల్లాలి!  అలాగే మట్టిలో ఉండే  వేరు పురుగుల వల్ల కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది - నివారణ గా దాల్చిన చెక్క+పసుపు+ కారం + పొగాకు కాడలు పొడి నీళ్ళలో కలిపి చెట్లు మొదళ్ళలోపోయాలి! అలాగే నెమటోడ్స్  వచ్చినప్పుడు వేర్లు కుళ్లిపోయి మొక్కలో ఉన్న బలాన్ని మొత్తం పీల్చేసుకొని మొక్క చనిపోయేలా చేస్తుంది. మట్టిలో చాలా రకాల నెమటోడ్స్ ఉంటాయి చాలావరకు మొక్కకి మంచి చేసేవి కొన్ని మాత్రమే హాని చేసేవి ఉంటాయి. వీటి ముందస్తు నివారణగా మొక్కలు పెట్టేముందు మట్టిలో వేప పిండి  కలపాలి! చీడ పీడలు రాకుండా ముందస్తు నివారణగా పంచతంత్ర కషాయం, వేప నూనె  స్ప్రే చేయాలి!  అయితే ఇట్లాంటివి వచ్చిన తర్వాత నివారించడం కంటే ఇవి రాకుండా ఇలా చేస్తే సరిపోతుంది. అది ఏంటంటే ఒక కుండీలో ఒక్కోరకమైన మొక్కలు పెడుతూ ఉంటాం.  ఒక సీజన్ చిక్కుడు పెడితే అదే కుండీలో/టబ్లో నెక్స్ట్ సీజన్ కి టమాటో వంగ అలా వేరు వేరు రకాలు మార్చుకుంటూ రొటేషన్ చేసుకుంటూ ఉండాలి! ఇలా రొటేషన్ చేస్తూ ఉంటే నెమటోడ్స్ కూడా రాకుండా నివారించుకోవచ్చు!  అలాగే మనం తోటలో అక్క ఎక్కడా కారం బంతి, ముద్దబంతి, సీమ బంతి/బంగళా బంతి, కలెక్టరు బంతి/cosmos, పుదీనా, నిమ్మగడ్డి పెంచుకోవాలి!  ఇవి పెట్టుకోవడం వల్ల వేరుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి! బంతి జాతి మొక్కలు పెట్టుకోవడం వల్ల తేనె తీగల్ని అట్రాక్ట్ చేస్తూ పరాగ/ పరపరాగా సంపర్కం జరిగి కాపు దిగుబడి పెరుగుతుంది. ఈ విధంగా మొక్కల్ని పెట్టుకున్నాక సీజన్ అయిపోయిన తర్వాత మొక్క వేళ్ళతోపాటు తీయకుండా వేర్లను భూమిలో వదిలేయాలి.  అవి  కంపోస్ట్ లా తయారవ్వడమే కాకుండా మూడు నెలల పాటు మట్టిలో వచ్చే ఏ రకమైన తెగుళ్లు రాకుండా నివారిస్తాయి! తీసేసిన వేస్ట్ ని వంటింటి వ్యర్థాలతో(నిమ్మజాతి తొక్కల్ని కాకుండా) కలిపి కంపోస్టులా తయారు చేసుకోవచ్చు! Wish you all happy gardening!

Samba Siva Tumuluri, Organic Farmer, SS Natural AGS

*****

మునగ పంట గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం: 
పెరటి తోటల్లో పెంచే ముఖ్యమైన మొక్క మునగ , ఇప్పుడు వాణిజ్య పరంగా పండిస్తున్నారు,కాయతో పాటు ఆకులు కూడా వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతున్నాయి.
వాతావరణం: 20 -25 సెల్సియస్ టెంపరేచర్ ఉన్న ప్రాంతాలు అనుకూలం, ఎక్కువ వేడి, చలి తట్టుకోలేదు .
నేలలు: అన్ని రకాల నేలలు అనుకూలం,చౌడు నేలలు అనుకూలం కాదు,
విత్తే సమయం: 1.వార్షిక మునగ ఎప్పుడు అయిన నాటుకోవచ్చు,వేసవి ప్రారంభంలో నే పూత వస్తుంది,
                         2. భాహువర్షిక రకాల లో కత్తిరింపులు జూన్ 2 వారం నుండి ఆగస్టు చివరి వరకు      భూమిలో నాతుకోవచ్చు,
రకాలు: దేశవాళీ రకాలు ఎక్కువగా సాగు లో ఉన్నాయి,జాఫ్నా,PKM-1 అనే రకం ఎక్కువగా సాగులో ఉంది,
PKM-1 రకం : వార్షిక రకం మొక్క 4-6 మీటర్ల ఎత్తు వరకు పెరిగి ,విత్తిన 160 -1 70రోజులలో పూతకు వస్తుంది,కాయ పొడవు 60-70 Cm ఉంటుంది, కాయ బరువు 150grm ఉంటుంది,ఒక్క చెట్టుకు 200-220 కాయలు కాస్తుంది,
జఫ్నా రకం : బహువార్షిక రకం,కాయ పొడవు 60-90Cm, మెత్తని గుజ్జు,రుచికరంగా ఉంటుంది,రెండో సంవ్సరం నుండి కాపుకు వస్తుంది,మొదటి రెండు సంవత్సరాలు సంవత్సరానికి చెట్టుకు 80-90 కాయలను, 4 వ సంవత్సరం నుండి 500-600 కాయలు వస్తాయి,
నీటి యాజమాన్యం: విత్తనాలు మొలక వచ్చే వరకు ప్రతి 3 రోజులకు నీరు పెట్టాలి,తర్వాత 10-15 రోజులకు ఒకసారి నీరు పోయాలి,
గొంగళి పురుగులు: చిన్న గోగలి పురుగులు కాడం పైన గుంపులు గుంపులు గా ఉండి పత్ర హరితం గోకి తింటాయి,పెద్ద గొగలి పురుగులు ఆకులను తిని నష్టపరుస్తాయి,
కాయ తొలుచు ఈగ: కాయ తొలుచు ఈగ పూత దశలో ఆశించి, పిందె దశలో కాయలో చేరుతుంది,లోపల గుజ్జు తినడం వల్ల కాయ ఆకారం మారిపోతుంది,
వేరు కుళ్ళు / కాండం కుళ్ళు తెగులు: వర్షా కాలంలో చెట్టు మొదలు దగ్గర నీరు నిలువ ఉండటం వల్ల కుల్లి చెట్టు కిందికి పడిపోతుంది తెగులు వస్తుంది,
కోత కోయటం: 1. భాహువార్షిక రకాలు నాటిన 8-9 నెలలకు కాపు వస్తుంది,
                        2. ఏక వార్షిక మునగ విత్తిన 6 నెలలకే కాపు వస్తుంది, 
మునగ పంట గురించి చెప్పుకోవాలి అంటే చాల ఉంది,నేను మునగ చెట్టు టెర్రస్ లో పెంచుకోవాలి అనే వారికోసం వారికి అవగాహన కోసం ఈ చిన్న సమాచారం మీకు తెలియజేస్తున్నాను.
     D. Lingeswaraiah (CTG- Kurnool)

*****

Topic: Guarani Crop

Welcome to today's discussion on the Guarani crop! This versatile crop is commonly grown on terraces among various vegetables. Let's dive into the details and learn how to cultivate and care for it effectively. 🌿

---

### Sowing Time
* Rainy Season Crop: June – July 🌧️
* Summer Crop: January – February ☀️

### Climate
* Suitable Climate: Hot climate
* Growth Benefit: Cooler climates enhance growth
* Optimal Seasons: Monsoon and summer

### Soil
* Suitable Soils: Water-logged soils, red soils, fertile soils
* Soil Mixture: Mix as per (30:30:20:20 = 100%) ratio:
  - 30% red soil
  - 30% cattle manure
  - 20% neem wood
  - 20% vermicompost

### Varieties
* Types: Natu varieties, hybrid varieties
* Harvest Period: 80-90 days

### Planting Distance
* Irrigated Varieties: 20 cm x 20 cm

### Cultivation Period
* Duration: 80 – 90 days
* Yield: 
  - Natu varieties: 3-4 kg per tree
  - Hybrid varieties: 4-6 kg per tree

### Water Management
* Initial Watering: Before planting and immediately after planting
* Regular Watering: Once in 3-4 days, depending on moisture level
* Drainage: Ensure pots have drainage holes

### Plant Protection
#### Worms:
* Fruit and Pod Borer: Appears 30-40 days after planting; damages pods, causing them to curl and shoots to stop growing

#### Sap-sucking Insects:
* Lamp Bugs, Aphids, White Gnats: Leaves turn yellow, curl up, and dry out
* Erra Nalli: Leaves become pale and white

#### Pests:
* Gray Rot: Leaves are covered with ash-like powder; common in dry climates with low humidity
* Cone / Pallaku Rot: Infected leaves turn yellow and pods turn white
* Dry Rot (Bacterial Wilt): First 15 roots wither and die during seed germination

### Harvesting
* First Harvest: 45 – 50 days after sowing
* Frequency: Once every 2-3 days; otherwise, cuttings will get tangled

### Tips for Good Harvest on Terrace
* Neem Powder: Use in soil mixture; spray neem oil with neem salt after 30 days of planting
* Drenching: Use Trichoderma viridi plants
* Companion Planting: Plant onion plants in the pot
* Glue Sheets: Place 2-4 sheets on the terrace to catch insects and pests

By following these methods, we can grow Guarani plants in a healthy manner on our terrace.

D. Lingeswaraiah (CTG-KURNOOL)

*****

బెండ పంట మన టెర్రస్ లో పండించే కూరగాయలలో ఎక్కువగా టెర్రస్ లో కనిపించే మొక్క విషయాలు తెలుసుకుందాం:

విత్తనం విట్టేసమయం: వర్షా కాలం పంట కోసం జూన్ – జులై, వేసవి  పంట కోసం జనవరి – ఫిబ్రవరి లాస్ట్ వరకు విత్తుకోవచ్చు.
వాతావరణం: వేడి వాతావరణం అనుకూలం, అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకు సహాయపడుతుంది,అందువల్ల ఈ పంట వర్షాకాలం మరియు వేసవి కాలంలో పండించడానికి అనుకూలమైనది.
నేలలు (Soils) : నీరు ఇంకే నేలలు,ఎర్ర నేలలు, సారవంతమైన నేలలు అనుకూలం.
Soil Mixer: (30 :30:20:30=100 %) ప్రకారం అంటే రెడ్ సాయిల్ 30+పశువుల ఎరువు 30 + వేప చెక్క 20 + వెర్మికాంపొస్ట్ 20,  kgs లో కలుపుకోవాలి,
రకాలు: నాటు రకాలు, హైబ్రిడ్ రకాలు చాలా వచ్చాయి,నాటు రకాలు ఉన్నాయి,పంట కాలం 80 – 90 రోజులు ఉంటుంది,
నాటే దూరం: 1. నీటరుగా పెరిగే రకాల మొక్క మొక్కకి మధ్య దూరం 20 Cm xX20 Cm
నాటు రకాలు పంట కాలం : 80 – 90 రోజులు ఉంటాయి, దిగుబడికుడా సుమారు ఒక చెట్టుకు 3-4kg ల వరకు వస్తాయి,
హైబ్రిడ్ రకాలు: 80-90 రోజులు ఉంటాయి,దిగుబడి కూడా సుమారు ఒక చెట్టుకు 4-6kg ల వరకు వస్తుంది.
నీటి యాజమాన్యం: నాటే ముందు నాటిన వెంటనే నీరు పోయాలి, తర్వాత మన Pot లొ తేమ శాతం బట్టి 3-4 రోజులకు ఒకసారి నీరు పోయాలి, Pot లొ డ్రైనేజ్ హోల్స్ కచ్చితంగా పెట్టుకోవాలి.

సస్య రక్షణ:
పురుగులు: 
1. మొవ్వు మరియు కాయతోలుచు పురుగు:  ఇది నాటిన 30-40 రోజుల నుండి ఆశిస్తుంది, మొక్క పెరుగుదలలో మోవ్వు ను, తర్వాత దశ లో కాయలను తొలిచి నష్టాన్ని కలుగచేస్తాయి, కాయలు వంకర్లు తిరిగి పోతాయి, చిగుర్లు ఆగిపోతాయి,
రసం పీల్చే పురుగులు:
2. దీపపు పురుగులు, పేను బంక, తెల్ల దోమ:ఆకుల అడుగు భాగం లో చేరి రసాన్ని పిల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారి పైకి ముడుచుకొని ఎండి పోతాయి,
3. ఎర్ర నల్లి: ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి తెల్లగా మారుతాయి, ఆకుల మీద సాలే గుడు తీగలు తెల్లగా కనిపిస్తాయి.

తెగుళ్లు:
1. బూడిద  తెగులు :  ఆకుల పైన అడుగు బాగాన బూడిదే వంటి పొడిచే కప్పబడి ఉంటాయి,తేమ తక్కువగా ఉండే పొడి వాతావరణం ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది,
2. శంకు / పల్లాకు తెగులు: తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగు కి మారి కాయలు గిదశబారి తెల్లగా అయిపోతాయి.
3. ఎండు తెగులు (బ్యాక్టీరియల్ విల్ట్): గింజలు మొలకెత్తినప్పుడు, మొదటి 15 రాజులలో ఎండిపోయి చనిపోతాయి.
కోత కోయటం: విత్తిన 45 – 50 రోజులకు మొడటి కోత వస్తుంది, 2-3 రోజులకు ఒకసారి కోత కోయాలి, లేదు అంటే ముడిరిపోతాయి,
బెండ పంటలో మనం చిన్న చిన్న పద్దతులు వాడటం వల్ల మన టెర్రస్ లో మంచి పంట తీసుకోవచ్చు: ( ఇది అన్ని మొక్కలకి చేసుకోవాలి)

a. వేప పిండిని సాయిల్ మిక్సర్ లో కచ్చితంగా వాడుకోవాలి, వేప నూనె నాటిన 30 రోజుల తర్వాత నుండి వేప నూనే స్ప్రే చేసుకోవాలి,
b. ట్రికోడర్మ విరిడి మొక్కల Pot లొ  డ్రెంచింగ్ చేసుకోవాలి ,
c. Pot లొ బంతి ,ఉల్లి మొక్కలు నాటుకోడం,
d. జిగురు అట్టలు,బట్టలు 2-4 వరకు మన టెర్రస్ లో పెట్టుకోవడం,
e. పురుగు,తెగుళ్లు ఆశించిన చిగుర్లు,కాయలు త్రుంచి దూరంగా పడేయడం ,

పైన తెలిపిన పద్దతిలో మన టెర్రస్ లో బెండ మొక్కలను ఆరోగ్యం గా పెంచుకోవచ్చు.
       D. Lingeswaraiah (CTG-KURNOOL)

*****

### 🌧️ Monsoon Gardening Guide for South India 2024 🌧️

Monsoon season is a wonderful time for gardening in South India, as the rains bring much-needed moisture and a burst of greenery. However, to ensure your garden thrives, it’s crucial to prepare well and choose the right plants. Here are some essential tips and plant recommendations to help you succeed this monsoon.

### 🌿 Preparing Your Garden for Monsoon:

#### 🌱 *Prepare the Soil:*
1. *Aerate the soil*: 🪓
   - Use a garden fork to loosen the soil, allowing better water penetration and root growth.
2. *Add compost*: 🌱
   - Enrich the soil with compost or organic manure to improve fertility and drainage.

#### 🚰 *Ensure Proper Drainage:*
3. *Check for waterlogging*: 🌊
   - Ensure your garden has good drainage. Use raised beds or soil mounds to prevent water stagnation.
4. *Install drainage systems*: 💧
   - Consider French drains or mulching to prevent soil erosion and improve water flow.

### 🌸 *Choosing the Right Plants:*

#### *Monsoon-Friendly Plants to Sow:*
1. *Vegetables:*
   - *Cucumbers (Kheera)* 🥒: Thrive in the humid, moist conditions.
   - *Okra (Bhindi)* 🌿: Grows quickly and loves the warm, wet weather.
   - *Spinach (Palak)* 🍃: Ideal for the cool, rainy climate.
   - *Beans (Phalli)* 🌱: Fast-growing and suitable for monsoon planting.
2. *Flowers:*
   - *Hibiscus* 🌺: Loves the rain and blooms beautifully.
   - *Jasmine (Mogra)* 🌼: Enjoys the wet conditions and adds fragrance.
   - *Marigold (Genda)* 🌸: Hardy and resistant to pests, perfect for the rainy season.
   - *Rain Lily (Zephyranthes)* 🌷: Blooms profusely during the monsoon.
3. *Herbs:*
   - *Basil (Tulsi)* 🌿: Thrives in the humidity and rain.
   - *Mint (Pudina)* 🌱: Grows vigorously with ample water.
   - *Coriander (Dhaniya)* 🌿: Prefers the cool, moist environment of the monsoon.

### 🐛 *Pest and Disease Management:*
4. *Regular inspections*: 🔍
   - Check plants regularly for pests and fungal infections, which are common during monsoons.
5. *Natural pesticides*: 🌿
   - Use neem oil or other organic pesticides to control pests safely.

### ✂️ *Pruning and Trimming:*
6. *Trim overgrown branches*: ✂️
   - Prune plants to remove dead or overgrown branches, ensuring better air circulation and reducing fungal risks.
7. *Remove weeds*: 🌾
    - Weeds compete for nutrients and can harbor pests, so keep your garden weed-free.

### 🪴 *Support for Plants:*
8. *Staking*: 🌾
    - Provide support for tall plants or those with heavy blooms to prevent them from toppling over.
9. *Trellis*: 🌿
    - Use trellises for climbers to help them grow upright and avoid rot.

### 💦 *Water Management:*
10. *Water judiciously*: 💧
    - Water only when necessary. Ensure the soil is moist but not waterlogged.
11. *Rainwater harvesting*: 🌧️
    - Collect and store rainwater for use during dry spells.

### 🍂 *Mulching:*
12. *Use organic mulch*: 🍁
    - Mulch your garden with organic materials like straw, leaves, or coconut husk to retain soil moisture and suppress weeds.

### 🌻 *Fertilization:*
13. *Light feeding*: 🌿
    - Fertilize plants lightly with organic fertilizers to support growth without overfeeding.

### 🛡️ *Protect Young Plants:*
14. *Use cloches*: 🌿
    - Protect young seedlings and delicate plants with cloches or plastic covers from heavy rain.

### 🌟 *Bonus Tips:*
- *Plant native species*: 🌿
  - Native plants are more adapted to local conditions and require less maintenance.
- *Create windbreaks*: 🌾
  - Plant taller plants or use barriers to protect your garden from strong winds.
- *Monitor weather forecasts*: 🌦️
  - Stay updated with weather forecasts to prepare for heavy rains or storms in advance.

### 🌱 *Additional Info:*
- *Soil Testing*: 🧪
  - Before the monsoon, get your soil tested to understand its nutrient profile and amend it accordingly.
- *Companion Planting*: 🌼
  - Practice companion planting to naturally repel pests and improve plant health. For example, marigolds can deter many garden pests.
- *Garden Hygiene*: 🧹
  - Keep your garden clean. Remove fallen leaves and debris to prevent fungal growth and pests.
- *Rain Protection*: ☔
  - Use temporary rain shelters for delicate plants or those in pots to protect them from heavy downpours.

With these comprehensive tips and plant suggestions, your garden should be all set to flourish during the monsoon season. Happy gardening, and may your plants thrive! 🌿🌧️😊
CTG Admin Pavan garu

*****

మొక్కలకి అవసరం అయిన జీవన ఎరువుల గురించి తెలుసుకుందాము


TRICHODERMA:-

ట్రైకోడర్మా అనేది బూజు జాతికి చెందిన శిలింద్ర నాశిని, ఇది మొక్కల్లో శిలింద్రపు తెగుళ్ళు,  ఎండు తెగుళ్లు, వేరు కుళ్ళు ను సమర్ధవంతం గా అరికడుతుంది.
కొత్తగా విత్తనాలు, దుంపలు నాటుకునే ముందు ట్రైకోడర్మా నీటిలో ముంచి నాటుకుంటే మంచిది, ట్రైకోడర్మా నీ soil mix కలుపుకునేటపుడు 1kg soil కి  5 నుండి 10gms కలుపుకోవాలి, మొక్క వాడిపోయి చనిపోయే స్థితి కి వెళ్తుంది అనుకున్నప్పుడు కొంచం ట్రైకోడర్మా నీ నీటిలో కలిపి మొక్క మొదట్లో పోయాలి.

PSUDOMONAS

Pseudomonas అనేది ఒక fungicide, insecticide, growth and yield promotor, ఇదొక beneficial బాక్టీరియా.
Pseudomonas కూడా soil mix లో ప్రతి 1kg soil కి 5 to 10gms కలుపుకోవాలి, మొక్కలు ఎదుగుదల కి, మంచి దిగుబడి కి ఇది చాలా ఉపయోగం.

VAM

Soil mix లో VAM ని కలపడం వలన మొక్కల వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది, మొక్క ఎదుగుదల బాగుంటుంది

NPK

మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధి ని మెరుగుపరుస్తుంది. మొక్కలలో శక్తి ని పెంచుతుంది. పండ్లు, కూరగాయలు ఉత్పత్తి పెంచుతుంది, మొక్కల్లో కొమ్మల సంఖ్య పెరుగుతుంది, పువ్వులు బాగా వస్థాయి.

METARHIZIUM

దీన్ని king of bio pesticide అనచ్చు, ఇది మొక్కలని ఆశించే మూడు వందల రకాల తెగుళ్ళు, వ్యాధులు, పురుగుల ని నివారిస్తుంది. 10 gms Metarhizium ని ఒక kg పశువుల ఎరువు, 250 gms వేప పిండి కలిపి 7 రోజలు పాటు నీళ్లు కలిపి గొనె బస్తా కప్పి ఉంచి 10 రోజుల తర్వాత మొక్కల కుండీలలో ఇస్తే ఈ ఫంగస్ pest ల పై ఆశించి సమూలం గా నివారిస్తుంది. 10gms Metarhizium ని 1 లీటర్ నీళ్లలో కలిపి మొక్కల మొదట్లో ఇవ్వచ్చు లేదా spray చేయచ్చు.

BAVARIA BASSIANA

ఇదొక జీవ శిలింద్ర నాశిని, దీన్ని అన్ని రకాల పువ్వులు, కూరగాయలు, పళ్ళ మొక్కలకు, ఇండోర్ ప్లాంట్స్ కి ఇవ్వచ్చు. లీటర్ నీటిలో 5-7gms దీన్ని కలిపి మొక్కల కు స్ప్రే చేయచ్చు.

BONE MEAL

దీన్ని కూరగాయలు, పళ్ళ మొక్కలకు వాడుకోవచ్చు, అధిక దిగుబడి వస్తుంది, కూరగాయలు పళ్ళ పరిమాణం బాగుంటుంది.

EPSOM SALT

Epsom salt మొక్కలకి వాడటం వలన మొక్కల ఆకుల్లో clorofil బాగా పెరుగుతుంది, దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరుగుతుంది, మొక్కల్లో రోగనిరొదక శక్తి పెరుగుతుంది, మొక్కల్ని replant చేసేటప్పుడు epsom salt వాడితే మొక్క transplantation shock నుండి త్వరగా కోలుకుంటుంది.

OWDC

Original waste decomposer దీనిలో మొక్కకి అవసరమైన 80 రకాల బాక్టీరియా ఉంటుంది,100 లీటర్ నీటిలో ఈ owdc bottle లోని లిక్విడ్ అంతా కలిపి ఒక kg బెల్లం వేసి ఒక 5 నుండి 7 రోజుల వరకు ప్రతి రోజు కలుపుతూ ఉండాలి, ఆ తర్వాత 1:5 ratio లో నీళ్లు కలిపి మొక్కలకి ఇవ్వచ్చు, 1:10 ratio లో కలిపి మొక్కల కి spray చేయచ్చు.. ఇది pesticide గా fungicide గా fertilizer గా పని చేస్తుంది, మట్టి గట్టి పడకుండా గుల్ల గా ఉంచుతుంది.

NEEM POWDER

వేపపిండి మట్టి మీశ్రమం లో కలపడం వలన వేరు పురుగుల నుండి మొక్కల్ని రక్షించుకోవచ్చు, వేప పిండి లో npk ఉంటుంది, ఇది మొక్కల ఎందుగుదల బావుండేలా చూస్తుంది.

EMULSIFIED 
NEEM OIL

EMULSIFIED Neem oil మొక్కలు పెంచే ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన వాటిలో  ప్రధానమైనది..
neem oil ని ప్రతి 15 రోజులకి ఒకసారి ఒక లీటర్ నీటికి కి 5ml కలిపి అన్ని రకాల మొక్కలకి spray చేస్తూ ఉండటం వలన చాలా వరకు తెగుళ్లు   వ్యాధుల నుండి మొక్కలను రక్షించుకోవచ్చు*

SEAWEED GRANULES 

మొక్కలకి ఇదొక పోషకాల గని, ఇది వాడటం వలన మొక్కల కి తక్షణ శక్తీ లభిస్తుంది, మొక్కలు వివిధ రకాల ఒత్తిడులకి గురికాకుండా రక్షిస్తుంది, మొక్కల ఎదుగుదల బాగుంటుంది. Soil ph స్థాయిలని మొక్కకు అనుగుణంగా ఉంచుతుంది.

TEAM CTG

*****
PEST -O-OIL
 పెస్టో ఆయిల్ అనేది వివిధ రకాల నూనెల మీశ్రమాలు కలగలపి తయారు చేయబడినది, దీని తయారీ లో వాడే నూనెలు

వేపనూనె
జీడీ గింజల నూనె
సీతాఫలం నూనె
చేప నూనె
కానుగ నూనె
వెల్లుల్లి రసం

పెస్టో ఆయిల్ నీటిలో త్వరగా కరిగిపోతుంది, ఇది నీటిలో కరగడానికి ఇతర పదార్ధాలేమి వాడవలసిన అవసరం లేదు. దీనికి సాంధ్రత అధికంగా (highly concentrated oil ) ఉంటుంది కనుక మొక్కలకి వాడుకునే ముందు ఒక లీటర్ నీటికి 1 ml నుండి 2ml మాత్రమే కలుపుకోవాలి

పెస్టో ఆయిల్ మొక్కల్లో ఈ క్రింద ఇవ్వబడిన అన్నీ రకాల తెగుళ్ల పై సమర్ధవంతం గా పని చేస్తుంది
ఆకుముడత
పేనుబంక
తామర పురుగు
పిండి నల్లి
తెల్ల, పచ్చ దోమ
ఎర్ర నల్లి
కాండం తొలుచు పురుగు
పువ్వుల మొగ్గలు తొలుచు పురుగు
రసం పీల్చే పురుగు
పండు ఈగ
గొంగళి పురుగు

పెస్టో ఆయిల్ పూర్తిగా ఆర్గానిక్ కనుక దీన్ని వారానికి ఒకసారి మొక్కలకు స్ప్రే చేయడం వలన మొక్కల కు ఎలాంటి తెగుళ్ళు , వ్యాధులు రాకుండా ఆరోగ్యం గా పెరుగుతాయి

పెస్టో ఆయిల్ ని డైల్యూషన్ చేసుకున్న తర్వాత మొక్కల కు స్ప్రే చేయడం తో పాటు మొక్కల మొదట్లో కూడా ఇవ్వచ్చు, దీని వల్ల మట్టి లో ఆశించే వేరు కుళ్ళు పురుగులు, తెగుళ్ళు కూడా రాకుండా ఉంటాయి

పెస్టో ఆయిల్ బాటిల్ లో నీరు తగలకుండా బాటిల్ ను స్టోర్ చేసుకోగలిగితే ఇది వీలైనంత ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది

TEAM CTG

*****

మొక్కలు బాగా పెరగాలన్న దిగుబడులు మంచిగా రావాలన్న గాలి, వెలుతురు, సూర్యరశ్మి,వాతావరణం ఎంత ముఖ్యమో అలాగే మొక్కలకు సూక్ష్మపోషకాలు అంతే అవసరం. పోషకాలు సమపాళ్ళలో అందకపోతే పంటలలో దిగుబడి నాణ్యత చాల వరకు తగ్గుతుంది. కాబట్టి మొక్కలలో పోషక లోపం రాకుండా చూసుకోవడం చాల అవసరం. అన్ని మొక్కలకు ఒకే రకమైన పోషక లోపాలురావు. వాటిని గుర్తించి తగిన పోషకాలు అందించాలి.

1) జింక్ (Zinc) ఉపయోగాలు = మొక్కలు గిడసబారి పోకుండా నత్రజని ఎరువులను మొక్కలకు అందిస్తుంది.లేత మొక్కలకు తగిన పోషకాలు అందించడంలో సహాయపడుతుంది.
జింక్ లోపం = జింక్ లోపం ఉన్న మొక్కలలో కణుపుల దూరం తగ్గడం, ఆకుల చివరి అంచులు ఎండినట్లు కనిపించడం,ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడటం జరుగుతుంది.

2) మేగ్నిషం (Magnesium) ఉపయోగాలు = భూమిలో ఉన్న ప్రోటీన్లను మొక్కలకు అందిస్తుంది. బాస్వరం ఎరువులను మొక్కలకు సమపాళ్ళలో అందిస్తుంది.
మేగ్నిషం లోపం = మేగ్నిషం లోపం ముదురు ఆకులలో కనిపిస్తుంది. ఆకులు పసుపు రంగులోకి మారటం లోపం ఎక్కువగా ఉన్నపుడు ఊదరంగులోకి మారి ఆకుల చివరి బాగంలో మచ్చలు ఏర్పడి ఆకులు రాలి పోవడం జరుగుతుంది.

3) బోరాన్ (Boron) ఉపయోగాలు = మొక్కలలో పూత పిందే రాలకుండా, చిగురుటాకులు క్రమ పద్ధతిలో పెరుగుదలకు సహాయ పడుతుంది.
బోరాన్ లోపం = మొక్కలలో చిగురుటాకులు ఆకుపచ్చ రంగును కోల్పోయి మెలికలు తిరిగి వంకరగా కనిపిస్తాయి. లేత ఆకులు మందంగా తయారై ఎదుగుదల లోపిస్తుంది. కాయలపై,కాండముపై పగుళ్ళు ఏర్పడతాయి. లేత పిందెలు మాడిపోవడం జరుగుతుంది.

4) మాంగనీసు (Manganese) ఉపయోగాలు = మొక్కలలో ఇనపధాతు లోపాన్ని సరిచేస్తూ మొక్కలలో కిరణజన్య క్రియను సరిచేస్తుంది.
మాంగనీసు లోపం = మాంగనీసు లోపం ఉన్న మొక్కలలో ఆకుల ఈనెల మద్య బాగం పసుపు రంగులోకి మారి ఆకులు క్రిందకు ముడుచుకొని ఉంటాయి.

5) ఇనుము (Iron) ఉపయోగాలు = ఆకులలో పత్రహరితం కోల్పోకుండా దాని తయారికి కీలక పాత్ర పోషిస్తుంది.వివిధ రాకల పోషకాలను మొక్కలకు అందిస్తుంది.
ఇనుము లోపం = మొక్కల లేత ఆకులలో ఇనుపధాతు లోపం కనిపిస్తుంది. ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఆకులు పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. చౌడునేలల్లో కూడా ఇనుము లోపం కనిపిస్తుంది.

6)  రాగి (Copper) ఉపయోగాలు = మొక్కలలో విటమిన్ “A” లోపం రాకుండా కాపాడుతుది.
రాగి లోపం = మొక్కల ఆకులు నీలి రంగులోకి మారి ఆకుల చివరి బాగం పసుపు రంగులోకి మారి చివరకు ఎండి పోతాయి.కాయలను పట్టుకొని చుస్తే బంకలగా అంటుకుంటుంది.
దగ్గుపాటి లింగేశ్వరయ్య 

- CTG - KURNOOL (9573110318)

*****

మొక్కలకు కావలసిన పోషకాలు మరియు వచ్చే పురుగులు తెగుళ్ల గురించి కొంత వరకు తెలుసుకుందాం: మొక్క పెరుగుదలకు ముఖ్యంగా కావల్సిన ప్రధాన పోషకాలు. 
1. స్థూల పోషకాలు వచ్చి నత్రజని, భాస్వరం, పొటాష్
2. సూక్ష్మ పోషకాలు వచ్చి ఐరన్, జింక్, మల్బినం, కాపర్, బోరాన్, etc...                                             
3. హార్మోన్స్: గిబ్బరిల్లిక్ యాసిడ్, ఇవి మొక్క సూర్య కిరణాల నుండి మొక్క తయారు చేసుకుంటుంది.

మొక్కలలో వచ్చే పురుగులు: కాండం తొలుచు పురుగు, రసం పీల్చు పురుగులు, తేనె మంచు పురుగులు, నల్లి, etc                              
మొక్కలకి వచ్చే ముఖ్యమైన తెగుళ్ళు: వేరు కుళ్లు, ఆకుముడత, కాయకుల్లు, etc, పై  సమస్యల నుండి మొక్కలను ఆరోగ్యంగా పెంచుకోవాలి అంటే ముఖ్యంగా సాయిల్ మిక్సర్ ప్రిపరేషన్ అనేది ముఖ్యం అందులో వేసుకునే వివిధరకాల కోకో పీట్, Neem Cake, Trycoderma Viridi, Sudomonas etc.. కలుపుకోవడం వల్ల పై సమస్యలు అధిగమించ వచ్చు అండి, అన్ని రకాల పురుగుల నుండి మొక్క ను కాపాడు కోవడానికి Neem Oil Best అండి, మన టెర్రస్ లో 1,2 పురుగులు కనిపించిన వెంటనే స్ప్రే చేయడం వల్ల వాటి పెరుగుదలను నివారించ వచ్చు, Weekly Once Neem Oil Spray చేయడం మంచిది.           

D. Lingeswaraiah (CTG-Kurnool)

*****

మన టెర్రస్ లో / బాల్కనీ లో నారు పెంచుకోవడం ఎలా అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం…

నారు ఎన్ని విధాలుగా పెంచుకోవచ్చు అంటే :
1. Soil, Sand, Coco Peat, Vermicompost, Silican, water లో ఇందులో మన అవసరం మన టెర్రస్ లో ఉండే గాలి వెలుతురు ,మరియు Sun Light ని బట్టి ఈ మెటీరయల్స్ తో మనకు కావాల్సిన విత్తనాలు నారు పోసుకొని పంచుకుంటాం.
2. విత్తనాలను బట్టి మనము ఎన్నుకొనే మెటీరియల్ కూడా ముఖ్యమైన అంశం,
3. All Soil mixer లో అయితే నిదానంగా మంచి నారు పెంచుకోవచ్చు,
4. కోకో పీట్, Sand, వెర్మికాంపోస్ట్, Water ( Hydrophonic)
5. Seed Germination Tray lo కుడా పెంచుకోవచ్చు,
6. మనం సెలెక్ట్ చేసుకున్న విత్తనం, ట్రాన్స్ ప్లాంటషన్ కోసం అయితే కోకో పీట్ లో ,Soil Mixer చేసుకున్న దానిలో పెంచుకోవచ్చు, Exmpl – టొమోటో, వంగ, మిరప, బంతి, క్యాబేజ్, కాలిఫ్లర్, Capsicum etc…
7. Leafy vegetables అయితే ట్రేస్ లో చిన్న మడులు, రౌండ్ టుబ్స్ చాలా బాగుంటాయి, గ్రో బ్యాంగ్స్ కుడా బాగుంటాయి, ఇందులో Exmpl: కొత్తిమీర, పాలక్, చుక్కకూర, పొన్నగంటి, గలిగేరు, పుదీనా, etc..
        
ముఖ్యంగా చాలా మంది పైన తెలిపిన ఏదో ఒక పద్దతి లో పెంచుకుంటూ ఉంటారు,
చాలా మంది కి సరిగా రావడం లేదు అని గ్రూప్స్ లో అడుగుతున్నారు.

మంచి నారు పెంచుకొనుటకు :
1. Sunlight ఉండే విధంగా చుస్కోవలి, గాలి వెలుతురు సరిగా వుండాలి, అలాగే నీరు ఎక్కువగా కాకుండా చూసుకోవాలి, ఇలా చేస్తే మంచి leafy vegetables వస్తాయి.

 మనం చేసే చిన్న పొరపాట్లు కనిపించవు కానీ గమనించండి:
1. సీడ్స్ నీ బాగా నాన బెట్టి 4-6 Hours పెట్టి నారు పోసుకోవడం వల్ల ఎత్తుగా పెరిగి చనిపోవడం.
2. మనం పెంచుకునే విత్తనం ఏ దానిలో పెట్టుకోవాలి అని తెలియక మనకున్న కుండీలో పెట్టుకోవడం.
3. యూట్యూబ్ లో చాలా మెథడ్స్ ఉన్నాయి అందులో చూసి అన్ని కలిపి మనం చేయడం, అక్కడ వారికి వచ్చింది మనకు రాలేదు అని బాధపడటం చాల చూస్తున్న.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ….
అలా కాకుండా మనకు ఉన్న టెర్రస్ లో గాలి వెలుతురు తగిలే చోట ఇలా నారు ట్రై లో పెంచుకుంటే ఎలాంటి నారు అయిన చాలా బాగా వస్తాయి.

CTG-Kurnool 
D.Lingeswaraiah


*****

*టెర్రేస్ గార్డెనింగ్ - మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ
PART- 6,  11.12.24*

సూర్యుడు / నీడ

మీ బాల్కనీ సూర్యకాంతి పొందే గంటలను మరియు గరిష్టంగా సూర్యరశ్మిని పొందే ప్రాంతాలను విశ్లేషించండి. మీ మొక్కలను ఎంచుకుని, సూర్యరశ్మిని పుష్కలంగా పొందే ప్రదేశాలలో ఉంచండి.
మీ బాల్కనీ నీడగా ఉంటే, తక్కువ సూర్యకాంతిలో వృద్ధి చెందగల మొక్కలను మీరు ఎంచుకోవచ్చు. మీ బాల్కనీకి వచ్చే పరోక్ష సూర్యకాంతి గంటలను గమనించండి మరియు తదనుగుణంగా మీ మొక్కలను ఎంచుకోండి.
అరుగులా, పాలకూర, బచ్చలికూర, ఆవాలు, చార్డ్, కాలే, మిజునా, కోమత్సునా వంటి అన్ని సలాడ్ ఆకుకూరలు పాక్షిక నీడలో బాగా పని చేస్తాయి, అయితే ఈ మొక్కలన్నింటికీ వృద్ధి చెందడానికి ప్రతిరోజూ కొంత సూర్యకాంతి అవసరం.

*టెర్రేస్ వెజిటబుల్ గార్డెనింగ్ - మీ పైకప్పు తోటలో పెరిగే కూరగాయలు*

మీరు మీ పైకప్పు తోటలో ఏదైనా మరియు ప్రతిదీ పెంచుకోవచ్చు. కూరగాయలు, మూలికలు, పొదలు, మైక్రోగ్రీన్‌ల నుండి పువ్వుల వరకు - మీరు దీనికి పేరు పెట్టండి. మీరు ఒక అనుభవశూన్యుడు అయితే, మీరు బచ్చలికూర, కొత్తిమీర, ముల్లంగి మొదలైన కూరగాయలను పెంచడం ప్రారంభించవచ్చు. ఈ కూరగాయలను ఏ సీజన్‌లోనైనా మరియు తక్కువ శ్రమతో పండించవచ్చు.
సూర్యరశ్మి, నీరు త్రాగుట, నేల PH స్థాయి మరియు ఉష్ణోగ్రత అవసరాలు వంటి అంశాలు మీ పైకప్పు తోటలో విత్తడానికి మీ విత్తనాలను ఎంచుకునే ముందు మీరు పరిగణించవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు.
మీ మొక్కలను సూర్యరశ్మి పుష్కలంగా పొందే ప్రదేశంలో ఉంచండి మరియు అన్ని మాంసాహారుల నుండి సురక్షితంగా ఉంటాయి.
భారతదేశంలో ఈ కూరగాయల సాగు సీజన్ క్యాలెండర్ సహాయంతో మీ పైకప్పుపై మీ స్వంత కాలానుగుణ కూరగాయలను పెంచడం ప్రారంభించండి. మా విస్తృత శ్రేణి విత్తన కిట్‌ల సేకరణ నుండి ప్రతి సీజన్‌కు సరైన ఆకుకూరలను ఎంచుకోవడం ద్వారా మీరు మీ తోటపని యాత్రను కూడా ప్రారంభించవచ్చు.

సంరక్షణ & నిర్వహణ
నీరు త్రాగుట

మీ రూఫ్‌టాప్ గార్డెన్ ప్లాంట్‌లకు నీరు పెట్టడం అనేది మీ సాధారణ గార్డెన్‌లోని మొక్కలకు నీళ్ళు పోయడం లాంటిది. ఒకే తేడా ఏమిటంటే, అదనపు నీరు బయటకు వెళ్లడానికి మీ పైకప్పు తోటలో సరైన డ్రైనేజీ వ్యవస్థ అవసరం. మీరు మీ మొక్కలకు నీటి డబ్బా లేదా గొట్టం సహాయంతో నీరు పెట్టవచ్చు.
ఉదయాన్నే మీ మొక్కలకు నీరు పెట్టడం అనేది వాటిని హైడ్రేట్ గా ఉంచడానికి మరియు కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియకు మద్దతు ఇవ్వడానికి ఒక గొప్ప మార్గం. పైకప్పు తోటలలోని నేల లోతు తక్కువగా ఉంటుంది మరియు త్వరగా ఎండిపోతుంది. అందువల్ల, ప్రతిరోజూ మీ మొక్కలకు నీరు పెట్టడం వల్ల మీ మొక్కలు హైడ్రేట్ గా మరియు ఆరోగ్యంగా ఉంటాయి.

G Suresh Babu, CTG,Vijayawada, 8&15

*****

వంగ పంట మన టెర్రస్ లో ఎలా పెంచుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం:
నారు పెంచుకోవడానికి విత్తనం విట్టేసమయం: వర్షా కాలం పంట కోసం జూన్ – జులై,శీతాకాలం పంట కోసం అక్టోబర్ – నవంబర్, వేసవి కాలం పంట కోసం జనవరి – ఫిబ్రవరి ల లొ నారు పెంచుకోవాలి.
నారు పెంచుకొనుటకు : 30- 35 రోజుల నారును నాటుకోవాలి Pot / నేల మీద కానీ నాటుకోవాలి,
నేలలు (Soils) : నీరు ఇంకే నేలలు,ఎర్ర నేలలు, సారవంతమైన నేలలు అనుకూలం,
Soil Mixer: (30 :30:20:30=100 %) ప్రకారం అంటే రెడ్ సాయిల్ 30+పశువుల ఎరువు 30 + వేప చెక్క 20 + వెర్మికాంపొస్ట్ 20,  kgs లో కలుపుకోవాలి,
రకాలు: నాటు రకాలు, హైబ్రిడ్ రకాలు చాలా వచ్చాయి,నాటు రకమైన కొన్ని పోలురు వంకాయ బాగా ఉంటుంది,
నాటే దూరం:1. నీటరుగా పెరిగే రకాల మొక్క మొక్కకి మధ్య దూరం 60 Cm x 60 Cm,
                     2. గుబురుగా పెరిగే రకాల మొక్క మొక్కకి మధ్య దూరం 75 Cm x 50 Cm,
నాటు రకాలు పంట కాలం : 130 – 140 రోజులు ఉంటాయి, దిగుబడికుడా సుమారు ఒక చెట్టుకు 6-8kg ల వరకు వస్తాయి,
హైబ్రిడ్ రకాలు: 140-160 రోజులు ఉంటాయి,దిగుబడి కూడా సుమారు ఒక చెట్టుకు 12-16kg ల వరకు వస్తుంది,
నీటి యాజమాన్యం: నాటే ముందు నాటిన వెంటనే నీరు పోయాలి, తర్వాత మన Pot లొ తేమ శాతం బట్టి 3-4 రోజులకు ఒకసారి నీరు పోయాలి, Pot లొ డ్రైనేజ్ హోల్స్ కచ్చితంగా పెట్టుకోవాలి, వంగ పంట లో వేరు కుళ్ళు రాకుండా ఉంటుంది.

సస్య రక్షణ:
పురుగులు
1. మొవ్వు మరియు కాయతోలుచు పురుగు:  ఇది నాటిన 30-40 రోజుల నుండి ఆశిస్తుంది, మొక్క పెరుగుదలలో మోవ్వు ను, తర్వాత దశ లో కాయలను తొలిచి నష్టాన్ని కలుగచేస్తాయి, కాయలు వంకర్లు తిరిగి పోతాయి, చిగుర్లు ఆగిపోతాయి.

రసం పీల్చే పురుగులు:
 2. దీపపు పురుగులు, పేను బంక, తెల్ల దోమ:ఆకుల అడుగు భాగం లో చేరి రసాన్ని పిల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారి పైకి ముడుచుకొని ఎండి పోతాయి,
3. ఎర్ర నల్లి: ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి తెల్లగా మారుతాయి, ఆకుల మీద సాలే గుడు తీగలు తెల్లగా కనిపిస్తాయి,
4. నులి పురుగులు (రూట్ నాట్ నెమటోడ్) : ఈ పురుగు చెట్టు వేర్ల మీద బొడిపెలాల కనిపిస్తాయి, ఇవి ఆశించిన మొక్కలు తక్కువగా పెరిగి తక్కువ కాయలను ఇస్తుంది.

తెగుళ్లు:
1. ఆకు మాడు తెగులు,కాయ కుళ్ళు తెగులు: ఇది నాటిన 30 రోజుల తర్వాత వస్తుంది, ఆకులు అన్ని మాడిపోయినట్లు కనిపిస్తాయి, ఈ తెగులు ఆశించిన ఆకుల పైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి, తెగులు ఎక్కువగా అయితే ఆకులు రాలిపోతాయి, తెగులు సోకిన కాయలు పసుపు రంగుకు మారి కుల్లిపోతాయి,
2. వెర్రి తెగులు (లిటిల్ లీఫ్): ఆకులు సన్నగా మారి పాలిపోయి ఆకు పచ్చని రంగు కలిగి ఉంటాయి, మొక్కలు గుబురుగా చీపురు కట్ట లా కనబడుతాయి, పూత కతా లేకుండా గొడ్డు బారి పోతాయి, ఇది వైరస్ తెగులు దోమల ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది,
3. ఎండు తెగులు (బ్యాక్టీరియల్ విల్ట్) : ఈ తెగులు ఆశిస్తే సరైన నివారణ చర్యలు లేవు, 
వంగ పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల పై సమస్యల నుండి మన టెర్రస్ లో ఉండే వంగ మొక్కలను కాపాడుకోవచ్చు:
    a. వేప పిండిని సాయిల్ మిక్సర్ లో కచ్చితంగా వాడుకోవాలి, వేప నూనె నాటిన 30 రోజుల తర్వాత నుండి వేప నూనే స్ప్రే చేసుకోవాలి.
    b. ట్రికోడర్మ విరిడి మొక్కల Pot లొ  డ్రెంచింగ్ చేసుకోవాలి.
    c. Pot లొ బంతి ,ఉల్లి మొక్కలు నాటుకోడం.
    d. జిగురు అట్టలు,బట్టలు 2-4 వరకు మన టెర్రస్ లో పెట్టుకోవడం.
    e. పురుగు,తెగుళ్లు ఆశించిన చిగుర్లు,కాయలు త్రుంచి దూరంగా పడేయడం.
పైన తెలిపిన పద్దతిలో మన టెర్రస్ లో వంగ మొక్కలను ఆరోగ్యం గా పెంచుకోవచ్చు.

 D. Lingeswaraiah (CTG-KURNOOL)

*****

టొమాటో పంట మన టెర్రస్ లో ఎలా పెంచుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం:
వాతావరణం విత్తనం విట్టేసమయం: వర్షా కాలం పంట కోసం జూన్ – జులై, శీతాకాలం పంట కోసం అక్టోబర్ – నవంబర్, వేసవి కాలం పంట కోసం జనవరి – ఫిబ్రవరి ల లొ నారు పెంచుకోవాలి.
1. టొమోటో పంటను సంవత్సరం పొడవునా అన్ని నెలలో పెంచుకోవచ్చు, అధిక దిగుబడి కి శీతాకాలం అనుకూలం, అధిక వేడిమి తట్టుకోలేదు, ఎక్కువ వర్షపాతం తట్టుకోలేదు.
నారు పెంచుకొనుటకు : 30- 35 రోజుల నారును నాటుకోవాలి Pot / నేల మీద కానీ నాటుకోవాలి.
నేలలు (Soils) : నీరు ఇంకే నేలలు, ఎర్ర నేలలు, సారవంతమైన నేలలు అనుకూలం.
Soil Mixer: (30 :30:20:30=100 %) ప్రకారం అంటే రెడ్ సాయిల్ 30+ పశువుల ఎరువు, 30 + వేప చెక్క 20 + వెర్మికాంపొస్ట్ 20,  kgs లో కలుపుకోవాలి,
రకాలు: నాటు రకాలు, హైబ్రిడ్ రకాలు చాలా వచ్చాయి,,
నాటే దూరం:  1. వర్షాకాలంలో  మొక్క మొక్కకి మధ్య దూరం 60 Cm x 45 Cm.
                         2. శీతాకాలం లో మొక్క మొక్కకి మధ్య దూరం 60 Cm x 60 Cm.
                         3.వేసవి కాలంలో మొక్కకి మొక్కకి మధ్య దూరం 45 Cm x 30 Cm
నాటు రకాలు పంట కాలం : 110 – 120 రోజులు ఉంటాయి, దిగుబడికుడా సుమారు ఒక చెట్టుకు 6-8kg ల వరకు వస్తాయి,
హైబ్రిడ్ రకాలు: 120-140 రోజులు ఉంటాయి,దిగుబడి కూడా సుమారు ఒక చెట్టుకు 12-16kg ల వరకు వస్తుంది,నీటి యాజమాన్యం,: నాటే ముందు నాటిన వెంటనే నీరు పోయాలి, తర్వాత మన Pot లొ తేమ శాతం బట్టి 3-4 రోజులకు ఒకసారి నీరు పోయాలి, Pot లొ డ్రైనేజ్ హోల్స్ కచ్చితంగా పెట్టుకోవాలి, టొమోటో పంట లో వేరు కుళ్ళు రాకుండా ఉంటుంది.

సస్య రక్షణ:
పురుగులు
1. కాయతోలుచు పురుగు:  ఇది నాటిన 30-40 రోజుల నుండి ఆశిస్తుంది, మొక్క పెరుగుదలలో మోవ్వు ను, తర్వాత దశ లో కాయలను తొలిచి నష్టాన్ని కలుగచేస్తాయి, కాయలు వంకర్లు తిరిగి పోతాయి, చిగుర్లు ఆగిపోతాయి,
2. పచ్చ దోమ : ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు పచ్చగా మారుతాయి, చివరకు ఆకులు ఎర్రగా మారి ముడుచుకొని దొనెలు మాదిరిగా కనిపిస్తాయి,
3. రబ్బరు పురుగు : ఈ పురుగు కాయ తొలుచు పురుగు లాగా పంటను నాశనము చేస్తుంది, విషపు ఎరలు పెట్టుకోవాలి.

తెగుళ్లు:
1. ఆకు మాడు తెగులు, ఎర్లీ బ్లైటే:  ఇది నాటిన 30 రోజుల తర్వాత వస్తుంది, ఆకులు అన్ని మాడిపోయినట్లు కనిపిస్తాయి, ఈ తెగులు ఆశించిన ఆకుల పైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయి, తెగులు ఎక్కువగా అయితే ఆకులు రాలిపోతాయి, తెగులు సోకిన కాయలు పసుపు రంగుకు మారి కుల్లిపోతాయి.
2. వడలు తెగులు (బ్యాక్టీరియల్ విల్ట్) : ఈ తెగులు ఆశిస్తే మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగుకు మారి, తోడిమ తో సహా రాలి, తర్వాత మొక్క చనిపోతుంది,
3. ఆకుముడత వైరస్: ఆకులు చిన్నగా మారి ముడుచుకోపోతాయి,మొక్క ఎదుగుదల తగ్గి పుతా, కాతా బాగా తగ్గిపోతుంది, ఇది తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది,
4. టొమోటో స్పాట్ విల్ట్ వైరస్: టొమోటో చిగూరు ఆకుల పై బాగం లో ఈనెలు గోధుమ వర్ణం కు మారి, ఆకుల మీద పసుపు మచ్చలు ఏర్పడి, మాడిపోతాయి, మొక్కలు గిదశబారి, పూత, పిందె పట్టక ఎండిపోతాయి, దీని నివారణకు వ్యాధి సోకిన మొక్కలు పికి వేయాలి ,
టొమోటో పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల పై సమస్యల నుండి మన టెర్రస్ లో ఉండే వంగ మొక్కలను కాపాడుకోవచ్చు:
    a. వేప పిండిని సాయిల్ మిక్సర్ లో కచ్చితంగా వాడుకోవాలి, వేప నూనె నాటిన 30 రోజుల తర్వాత నుండి వేప నూనే స్ప్రే చేసుకోవాలి.
    b. ట్రికోడర్మ విరిడి మొక్కల Pot లొ  డ్రెంచింగ్ చేసుకోవాలి.
    c. సజ్జ విత్తనాలు వేసుకోవాలి కుండి లో
    d. జిగురు అట్టలు,బట్టలు 2-4 వరకు మన టెర్రస్ లో పెట్టుకోవడం.
    e. పురుగు,తెగుళ్లు ఆశించిన చిగుర్లు,కాయలు త్రుంచి దూరంగా పడేయడం.
పైన తెలిపిన పద్దతిలో మన టెర్రస్ లో టొమోటో మొక్కలను ఆరోగ్యం గా పెంచుకోవచ్చు.

                     D. Lingeswaraiah (CTG-KURNOOL)

*****

మన టెర్రస్ లో పందిరి కూరగాయల పెంపకం వాటి వివరాలు:
పందిరి కూరగాయలు: కాకర, బీర, సొర (అనప), దోస, గుమ్మడి, బూడిద గుమ్మడి, దొండ
వాతావరణం: వేడి వాతావరం అనుకూలం
నేలలు: నీటిని నిలుపుకునే తేలిక పాటి బంక మట్టి నేలలు, ఎర్ర నేలలు అనుకూలం
విత్తే సమయం:
    A. కాకర, ఆనప,దోస : జూన్ – జులై చివరివరకు
    B. బీర,బూడిద గుమ్మడి: జూన్ – ఆగస్ట్ & డిసెంబర్ – ఫిబ్రవరి
    C. గుమ్మడి,పోట్ల: జూన్ – జులై, డిసెంబర్ – జనవరి
    D. దొండ : జూన్ – జులై, చలి తక్కువగా ఉండే కాస్తా ఆంధ్ర లో సంవత్సరం అంత నాటు కోవచ్చు,
విత్తనం & విత్తుకొనే పద్దతి: కుండీలో 2-4 విత్తనాలు విత్తుకోవాలి,1-2 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి,
విత్తన శుద్ధి: ట్రైకో డేర్మా విరిడి లో విత్తనాలు కలిపి విత్తుకోవాలి,
నీటి యాజాన్యం: విత్తే ముందు మనం కుండి 12 గంటల ముందు మట్టిని తడుపుకొని పెట్టుకోవాలి, విత్తిన 3-4 రోజులకు ఒకసారి నీరు పోయాలి.

సస్య రక్షణ
పురుగులు: పెంకుపురుగులు,ఆకుపురుగులు,పండు ఈగ ప్రదానం గా వచ్చు పురుగులు,
నివారణ: వేపనూనె స్ప్రే చేసుకోవాలి.
తెగుళ్లు: బూజు తెగులు, వేరుకుల్లు,వెర్రి తెగులు, ఆంత్రాక్స్ (పక్షి కన్ను తెగులు)
నివారణ: ట్రైకోడర్మ విరైడి, జీవామృతం వాడుకోవాలి,
తీగ జాతి కూరగాయలు పెంచుకోవడంలో కొన్ని జాగ్రతలు పాటించి మంచి దిగుబడి పొందడం.
1. మొలక వచ్చాక తీగ పాకే సమయంలో పందిరి లేదా నెట్ మీదకి జాగ్రత్తగా ట్రైన్ చేసుకోవాలి,
2. పూత సమయంలో Male,Female ఫ్లవర్స్ ని గమనించి హ్యాండ్ పోలినేషన్ చేసుకోవడం వల్ల వెంటనే పంట తీసుకోవచ్చు,
3. తేనె తీగలు, సీతాకోక చిలుకలు (బట్టర్ ఫ్లై) మన టెర్రస్ లో కనిపిస్తే హ్యాండ్ పొలినేషన్ అవసరం తక్కువగా వుంటుంది
4. ఎక్కువగా నీళ్లు పోయడం వల్ల వెరుకుల్లు తెగులు వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది కనుక 3-4 రోజులకు ఒకసారి పోయాలి,
5. ఎక్కువగా నీరు పోయడం వల్ల మన కుండీలో ఉన్న పోషకాలు డ్రైన్ అవుతాయి, Pot లొ ఎంత అవసరమో అంతే నీరు పోయడం వల్ల పోషకాలు పోకుండా కాపాడుకోవచ్చు.

D.Lingeswaraiah (CTG-Kurnool)

*****

Post a Comment

0 Comments